చేపలకు మెమొరీ పవర్ ఎక్కువా..?

470fish,0చేపలకు మెమొరీ పవర్ ఎక్కువగా ఉంటుందా అంటే అవుననే అంటున్నారు సైంటిస్టులు. పెద్ద చేపల సంగతి పక్కన పెడితే ఎక్వేరియంలో పెంచే చిన్న చేపల మెమొరీ మాత్రం బాగా రిచ్ గానే ఉంటుందంట. మహా అయితే ఒకట్రెండు రోజులు అనుకోకండి…దాదాపు పన్నెండు రోజులకు పైగా గుర్తు పెట్టుకునేంత మెమొరీ పవర్ ఉంటుందంట చేపలకి. ఆఫ్రికన్ సిక్లిడ్ రకం ఎక్వేరియం ఫిస్ లకు ఈ తరహా మెమొరీ ఉంటుందని సైంటిస్టులు తేల్చారు.

ఆఫ్రికన్  సిక్లిడ్స్  రకం  ఫిష్  కు మెమోరీ పవర్ ఎక్కువంటున్నారు కెనడా సైంటిస్టులు. చేపల్లో మెమోరీ పవర్ లెవెల్స్ పై  ఓ టెస్ట్ జరిపారు. ఈ టెస్ట్ తో సైంటిస్టుల మైండ్ బ్లాక్ అయ్యింది.  చిన్న చిన్న విషయాలను కూడా  ఏకంగా పన్నెండు  రోజుల వరకు  గుర్తు  పెట్టుకునే  అద్భుతమైన మెమెరీ ….ఈ చేపల సొంతమని తేల్చారు.

మెమొరీ పవర్ ను  టెస్ట్  చేయడం కోసం ఒక అక్వేరియాన్ని తీసుకున్నారు.  ఈ పెద్ద ఎక్వేరియంలో   కేవలం కొన్ని  భాగాల్లోనే  చేపలకు ఆహారం దొరికేలా ఏర్పాట్లు  చేశారు. ముందుగా ఆఫ్రికన్  సిక్లిడ్  జాతి చేపలను, ఆహారం  ఉన్న ప్రాంతంలో  వదిలారు. ఇలా రోజుకు  ఇరవై నిముషాల పాటు ఎక్వేరియంలోని ఒక భాగంలో  చేపల్ని వదిలి..తర్వాత 12 రోజులు రెస్ట్ ఇచ్చారు.  పన్నెండు రోజుల తర్వాత  మరోసారి అక్వేరియంలోకి చేపలను వదిలారు.  సాఫ్ట్ వేర్ సాయంతో వాటి  మూవ్ మెంట్స్ ను  రికార్డు చేశారు.

పన్నెండు రోజుల గ్యాప్ తర్వాత కూడా గతంలో ఎక్కడైతే వదిలారో అదే  ప్రాంతానికెళ్లాయి ఈ ఆఫ్రికన్  సిక్లిడ్స్.  అక్కడక్కడే  తిరిగాయి.  ఫుడ్  తీసుకున్నాయి.  అక్వేరియంలోని  మిగతా  ఏరియా వైపు కనీసం కన్నెత్తి  కూడా చూడలేదు. మొత్తానికి ఈ టెస్ట్ తో చేపల మెమోరీ పవర్.. ‘పవర్ ఫుల్’ గానే ఉందని తేల్చారు సైంటిస్టులు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy