చేసిన పాపానికి శిక్ష : ఆశారాంకి జీవిత ఖైదు

asaram-bapuబాలికపై అత్యాచారం చేసిన కేసులో దోషిగా తేలిన ఆశారాంకు (77) జైలు శిక్ష ఖ‌రారైంది. జోధ్‌పూర్ కోర్టు జీవిత ఖైదు విధించింది. బుధవారం (ఏప్రిల్-25) ఉదయం ఈ కేసును విచారించిన కోర్టు.. బాలికను అత్యాచారం చేసిన కేసులో దోషిగా తేల్చింది. మరో ఇద్దరు దోషులకు 20 సంవత్సరాల చొప్పున జైలు శిక్ష విధించింది. ఈ తీర్పుపై అప్పీల్ చేస్తామని ఆశారాం వర్గీయులు ప్రకటించారు.

ఆశారాం తనపై అత్యాచారం చేశాడని 2013 అగస్ట్ 3న  ఓ బాలిక కేసు పెట్టింది. అహ్మదాబాద్ సిటీ శివార్లలోని ఆశ్రమంలో ఉన్నప్పుడు 1997-2006 మధ్య చాలాసార్లు లైంగిక దాడులకు పాల్పడ్డారని సూరత్ కు చెందిన ఈ బాలిక కేసు పెట్టింది.  ఈ కేసులో 2013లో అరెస్ట్ అయిన ఆశారాం.. అప్పట్నించి జోథ్ పూర్ సెంట్రల్ జైలులో ఉన్నాడు. ప్రస్తుతం 77 ఏళ్ల ఆశారాం.. ఈ శిక్షతో మరింత డీలా పడ్డాడు. జీవిత ఖైదు విధించటంతో జైల్లో కన్నీళ్లు పెట్టినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy