‘చైతూ -16’కి ముహూర్తం ఫిక్స్

chaithuమారుతి డైరెక్షన్ లో అక్కినేని నాగచైతన్య హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ మూవీని శనివారం (నవంబర్-25)న లాంచ్ చేయనున్నట్లు తెలిపాడు మారుతి. ప్రేమమ్ సినిమాను నిర్మించిన సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లోనే రూపొందనున్న ఈ మూవీ.. శనివారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో పూజకార్యక్రమాలతో ప్రారంభంకానుందని ట్వీట్టర్ ద్వారా వెల్లడించాడు మారుతి. చైతూ 16వ సినిమాను డైరెక్ట్ చేయనున్నట్లు క్లారిటీ ఇస్తున్నట్లు ఓ ఫోటోను కూడా పోస్ట్ చేశాడు. జనవరి 5 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ మూవీలో చైతు సరసన నటించే హీరోయిన్ ఎవరన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం చైతూ చందూ మొండేటి తెరకెక్కిస్తున్న ‘సవ్వసాచి’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy