చైనాతో మనకేంటి నష్టం..?

CHAINA STOCKMARKET DOWNప్రపంచ మార్కెట్లను డ్రాగన్ వణికిస్తోంది. స్టాక్ మార్కెట్లపై మరోసారి చైనా దెబ్బ పడింది. వరుసగా నాలుగో రోజూ మార్కెట్లు నష్టాల్లోనే ముగిశాయి. వారంలో రెండో సారి భారీగా పతనమయ్యాయి. దీనికి తోడు 2014 జూన్ తర్వాత 19 నెలల కనిష్ఠానికి సెన్సెక్స్ పడిపోయింది. ప్రపంచ మార్కెట్లకు చైనా ఫీవర్ పట్టుకుంది. కొత్త ఏడాది స్టాక్ మార్కెట్ ను డ్రాగన్ వణికిస్తోంది. చైనాలో నెలకొన్న ఆర్ధిక మాంద్యం అంతకంతకూ తీవ్రమౌతోంది. దీనికి తోడు కరెన్సీ విలువను తగ్గించింది ఆదేశ సెంట్రల్ బ్యాంక్. దీంతో ప్రపంచ మార్కెట్లపై చైనా ఎఫెక్ట్ కంటిన్యూ అవుతోంది.

చైనా మార్కెట్ లకు ప్రపంచంతో లింకేంటి..?

ప్రపంచంలో అత్యధిక జీడీపీ ఉన్న దేశాల్లో చైనా సెకండ్ ప్లేస్ లో ఉంది.  ప్రపంచ ఆర్ధిక వ్యవహారాల్లో 17 శాతం చైనా ప్రభావంతోనే జరుగుతుంటాయి. దీంతో చైనాలో జరిగే చిన్న మార్పులు కూడా ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి.  చైనా విదేశీ కరెన్సీ నిల్వలు నెలనెలకు తగ్గిపోవటంతో… తమ కరెన్సీ యువాన్ విలువను తగ్గించింది. చైనా ఆర్ధిక వ్యవస్థ బలహీన పడుతోందని వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన నివేదిక… పరిస్థితిని మరింత దిగజార్చింది. అటు క్రూడ్ ఆయిల్ ధరలు కుడా రికార్డు స్థాయిలో పడిపోవడంతో మార్కెట్లు కోలుకోలేక పోతున్నాయి.

పెద్ద దెబ్బ యూరప్ మార్కట్లకే…

చైనా మార్కెట్లు కుప్పకూలటంతో యూరప్ మార్కెట్లపై భారీ ప్రభావం పడింది. దాదాపు అన్ని మార్కెట్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. ఇక ఆసియా వ్యాప్తంగా మార్కెట్లు లాస్ ను కంటిన్యూ చేశాయి. గురువారం సెన్సెక్స్ 554 పాయింట్లు నష్టపోయి.. 24 వేల 851 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 172 పాయింట్లు నష్టపోయి 7వేల 568 దగ్గర ముగిసింది. అయితే 2014 జూన్ తర్వాత ఇంత తక్కువ స్థాయిలో సెన్సెక్స్ ముగియటం ఇదే ఫస్ట్ టైం.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy