చైనాను అమెరికా ఢీ కొడుతుందా..?

b-1-bombers_650x400_81473738472అమెరికా, చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దక్షిణ చైనా సముద్రంపై అమెరికా వైమానిక దళానికి చెందిన యుద్ధవిమానాలు చక్కర్లు కొట్టడమే దీనికి కారణం. గత నెల చివరలో ఈ యుద్ధ విమానాలు ప్రయాణించినట్టు ప్రకటించారు అమెరికా సైన్యాధికారులు.  ఒకపక్క నార్త్ కోరియా సమస్యపై చైనాతో అమెరికా సంప్రదింపులు జరిపేందుకు రెడీ అవుతున్న సందర్భంలో దక్షిణ చైనా సముద్రంపై అమెరికా యుద్ధ విమానాలు వెళ్లడంపై అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. అసలే దక్షిణ చైనా సముద్రంపై చైనా తన పట్టును నిలుపుకునేందుకు ప్రయత్నిస్తుంటే.. అమెరికా కవ్వింపు చర్యలకు దిగుతోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకుంటోంది చైనా. దక్షిణ చైనా సముద్ర గగనతలంలో ఎవరైనా స్వేచ్ఛగా వెళ్లొచ్చని… కానీ తమ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేవిధంగా ఉంటే మాత్రం.. చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది. తమ రక్షణపై నిరంతరం దృష్టి ఉంటుందని.. అలాగే ఇతర దేశాలపై నిఘా ఉంటుందని తెలిపింది.

దక్షిణ చైనా సముద్రాన్ని వియత్నాం, బ్రూనే, మలేషియా, ఫిలిప్పీన్స్, చైనా దేశాలు వ్యాపార, వాణిజ్య మార్గంగా వినియోగించుకుంటున్నాయి. ఈ మార్గంలో ఏటా 5000 కోట్ల డాలర్ల బిజినెస్ జరుగుతున్నట్టు చెబుతున్నారు అంతర్జాతీయ నిపుణులు. దీనిపై పట్టుకోసం చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మరోవైపు చైనా ఆధిపత్య ధోరణిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఆయా దేశాలు. చైనా ధోరణిపై ఇప్పటికే  అంతర్జాతీయం విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy