చైనాను మించనున్న భారత జనాభా

india-china

ఐక్యరాజ్యసమితి అంచనా

భారత దేశ జనాభా 2024 నాటికి చైనాను మించిపోతుందని అంచనా వేసింది ఐక్యరాజ్యసమితి (ఐరాస). 2030 నాటికి 150 కోట్లకు చేరుతుందని పేర్కొంది ఐరాస…. ‘ప్రపంచ జనాభా భావి అంచనాలు: 2017 సవరణ’ పేరుతో నివేదికను వెలువరించింది ఐరాసకు చెందిన ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం. ఇవి 25వ అధికారిక అంచనాలు. 2015లో 24వ అంచనాలను విడుదల చేసింది. 2022 నాటికే చైనా జనాభాను భారత్‌ మించిపోతుందని అప్పటి అంచనాల్లో పేర్కొనగా, తాజా అంచనాల్లో 2024గా సవరించింది.

.. చైనా ప్రస్తుత జనాభా 141 కోట్లు (ప్రపంచ జనాభాలో 19శాతం)
.. భారత ప్రస్తుత జనాభా 134 కోట్లు (ప్రపంచ జనాభాలో 18 శాతం)
.. 2024 నాటికి రెండు దేశాలూ దాదాపు 144 కోట్ల చొప్పున జనాభా కలిగి ఉంటాయి.
.. భారత్‌ జనాభా 2030 నాటికి దాదాపు 150 కోట్లకు చేరుతుంది

.. 2050 నాటికి 166 కోట్లకు చేరుతుంది.
.. 2050 నుంచి 2100 మధ్య 50 ఏళ్ల కాలంలో భారత జనాభా తగ్గి 151 కోట్లు కావచ్చు. అయినప్పటికీ ప్రపంచంలో అత్యంత జనాభాగల దేశంగా ఉంటుంది.
.. జనన కాలంలో ఉన్న పరిస్థితులను బట్టి భారత్‌లో జీవిత కాలం (లైఫ్‌ ఎక్స్‌పెక్టెన్సీ ఎట్‌ బర్త్‌) 2025-30లో 71 ఏళ్లు. 2045-50కి 74.2ఏళ్లకు పెరుగుతుంది.
.. ఐదేళ్ల వయస్సు లోపు మరణాల రేటు 2025-30లో 32.3 (ప్రతి వెయ్యి మంది పిల్లలకు 32.3 మరణాలు). 2045-2050 నాటికి ఈ రేటు 18.6.
.. 2030 వరకు చైనా జనాభా స్థిరంగానే ఉంటుంది. ఆ తర్వాత కొంత తగ్గడం మొదలుకావచ్చు.
.. ప్రస్తుత ప్రపంచ జనాభా 760 కోట్లు కాగా 2030 నాటికి 860 కోట్లకు, 2050 నాటికి 980 కోట్లకు, 2100 నాటికి 1120 కోట్లకు చేరుతుంది.
.. భారత్‌, నైజీరియా, కాంగో, పాకిస్థాన్‌, ఇథియోపియా, టాంజానియా, అమెరికా, ఉగాండా, ఇండోనేషియా, ఈజిప్టులు ప్రపంచంలో సగానికిపైగా జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తాయి.
.. 2015-2050 మధ్య వలసల గమ్యస్థానం ఎక్కువగా (ఏడాదికి లక్షమందికి పైగా) ఉండే దేశాలు అమెరికా, జర్మనీ, కెనడా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, రష్యా.
.. ఏడాదికి లక్ష మందికి పైగా వలసలను పంపించే దేశాలు భారత్‌, బంగ్లాదేశ్‌, చైనా, పాకిస్థాన్‌, ఇండోనేషియా.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy