చైనాలో భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురు మృతి

China-Hotel-fireచైనాలోని ఓ లగ్జరీ హోటల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నాన్ చాంగ్ లో జరిగిన ఈ దుర్ఘటనలో ముగ్గురు మరణించగా, సుమారు 14 మంది గాయాలబారినపడ్డారు. ఆ హోటల్లో ఇంకా చాలామంది చిక్కుకున్నట్టు తెలుస్తోంది. హెచ్‌ఎన్‌ఏ ప్లాటినం మిక్స్‌ హోటల్‌ నుంచి పెద్ద ఎత్తున పొగలు, మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

హోటల్‌ బిల్డింగ్ నుంచి దట్టమైన పొగలు వ్యాపిస్తున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. భవనంలో చిక్కుకుపోయిన వాళ్లను కాపాడేందుకు రెస్క్యూ టీం లు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఈ హోటల్‌ పక్కనే 24 అంతస్థుల అపార్ట్‌మెంట్‌ కూడా ఉండడంతో మంటలను వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy