చైనాలో స్టూడెంట్ లీడర్లు మిస్సింగ్

ఆగస్ట్ నుంచి 9 మంది విద్యార్థి నేతలు గాయబ్

హాంకాంగ్ : యూనివర్సిటీ క్యాంపస్‌ లను విజ్ఞాన కేంద్రాలుగా, ఉద్యమాలకు పుట్టిళ్లుగా చెబుతుంటారు.. చైనా యూనివర్సిటీలలో మాత్రం ఇప్పుడు పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. క్యాంపస్‌ ల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఎప్పుడు ఎక్కడ ఏ స్టూడెంట్‌ కనిపించకుండా పోతాడోననే భయం స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌లో కనిపిస్తోంది. కార్మికుల హక్కుల కోసం పోరాడేందుకు ముందుకు రావడంతో చైనా ప్రభుత్వం వారి గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తోంది. ఒక్కొక్కరుగా స్టూడెంట్లు గాయబ్‌ అవుతున్నా రు. ‘సడెన్‌ గా ఎవరో వస్తారు, స్టూ డెంట్‌ లీడర్లను ఎత్తు కెళతారు. అరెస్టు చేసినట్లు పోలీసుల రికార్డుల్లో ఉండదు.. ఆ స్టూడెంట్లూ మళ్లీ కనిపించరు. వాళ్లేమైపోయారోననే విషయం ఎవరికీ తెలియదు.

గత ఆగస్టు నుంచి ఇప్పటి వరకు పెకింగ్‌ యూనివర్సిటీతో పాటు పలు ఇతర వర్సిటీలకు చెందిన తొమ్మిది మంది స్టూడెంట్లు ఇలాగే కనిపించకుండా పోయారు. పోయిన శుక్రవారం బీజింగ్‌ యూనివర్సిటీ వద్ద జాంగ్‌ షెంగ్యే అనే స్టూడెంట్‌ పై బ్లాక్‌ జాకెట్స్‌‌‌‌‌‌‌‌ వేసుకున్న కొంతమంది దాడి చేశారు. బలవంతంగా కార్లో కి ఎక్కించుకొని తీసుకెళ్లారు. అడ్డుకోడానికి ప్రయత్నిం చిన మిగతా స్టూ డెంట్లపైనా దాడికి ప్రయత్నిం చారు. ఎవరు మీరు, ఎందుకు అతడిని తీసుకెళుతున్నారని ప్రశ్నిస్తే.. నోర్మూసుకోకపోతే నీకూ తన్నులు తప్పవని బెదిరించారు’ అని ఆ సమయంలో పక్కనే ఉన్న మరో స్టూ డెంట్‌ లీడర్‌ యూ తియాన్‌ ఫు చెప్పారు.

ఎందుకీ నిర్బంధం?

మొన్నటి జూన్‌ లో షెన్‌ జెన్‌ సిటీలోని జేసిక్‌ టెక్నా లజీ ఉద్యోగుల ట్రేడ్‌ యూనియన్‌ ఏర్పాటు ప్రయత్నాన్ని ప్రభుత్వం అడ్డుకుంది. నిరసన ప్రదర్శనలు చేసిన వారిలో కొంతమందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరికి మద్దతుగా పోరాడేందుకు తరలిరావాలంటూ పెకింగ్‌ యూనివర్సిటీకి చెందిన లెఫ్ట్‌‌‌‌‌‌‌‌ వింగ్‌ స్టూడెంట్‌ లీడర్‌ యూక్ సిన్‌ చాలా యూనివర్సిటీలకు లేఖ రాశారు. జూలై 29న జేసిక్‌ ఉద్యోగుల నిరసనకు స్టూడెంట్‌ లీడర్లు తోడవడంతో దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. దీంతో ఆగస్టు 11న సన్‌ యట్‌ సేన్‌ యూనివర్సిటీ లీడర్‌ షెన్‌ మెంగ్యూను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తు కెళ్లారు. ఆగస్టు 24న యూ క్సిన్‌ కనిపించకుండా పోయాడు. వీరితోపాటు మరికొందరు విద్యార్థులు కూడా అప్పటి నుంచి కనిపించడంలేదు. వీళ్ల ఆచూకీ కోసం ‘ఫైండింగ్‌ యూ మూవ్‌ మెంట్‌ ’ ఏర్పాటు చేసిన జాంగ్‌ కూడా కనిపించకుండా పోయాడు. విద్యార్థు ల అదృశ్యం పై ప్రపంచ దృష్టిని ఆకర్షించే ప్రయత్నంచేయడమే జాంగ్‌ చేసిన తప్పని చైనా విద్యార్థులతో టచ్‌ లో ఉంటున్న కార్నెల్‌ వర్సిటీ ప్రొఫెసర్‌ ఫ్రైడ్‌ మాన్ చెప్పారు. పెకింగ్‌ వర్సిటీకి కొత్త కమ్యూనిస్ట్‌‌‌‌‌‌‌‌ చీఫ్‌‌‌‌‌‌‌‌గా క్యూషి పింగ్‌ బాధ్యతలు తీసుకున్నాకే ఈ అరెస్టుల పర్వం మొదలైందని అన్నా రు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy