చైనా ఓపెన్: క్వార్టర్ ఫైనల్స్ లో సింధు, శ్రీకాంత్

చైనా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో స్టార్‌ షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్‌లు పోరాడి గెలిచి క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరారు. గురువారం(సెప్టెంబర్-20) జరిగిన మహిళల సింగిల్స్‌లో సింధు, థాయ్‌లాండ్‌కు చెందిన  బుసానన్‌ ఒంగ్‌బామ్‌రుంగ్‌ఫాన్‌ను 21-23, 21-13, 21-18 తేడాతో ఓడించింది.  మొదటి గేమ్‌లో పోరాడి ఓడినప్పటికి.. రెండో గేమ్‌లో పుంజుకుని విజయం సాధించింది. కీలకమైన మూడో గేమ్‌లో సింధుకు ప్రత్యర్థి నుంచి గట్టి ప్రతిఘటన ఎదురైంది. చివరికి సింధు 21-18 తేడాతో గెలుపొంది మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.

పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌ థాయ్‌లాండ్‌కు చెందిన సుపాన్యు అవిహింగ్సానన్‌ను ఓడించి క్వార్టర్‌ ఫైనల్స్ కు చేరాడు. తొలి గేమ్‌ను 21-12 తేడాతో గెలిచిన శ్రీకాంత్‌ రెండో గేమ్‌లో 15-21తో ప్రత్యర్థికి కోల్పోయాడు. మూడో గేమ్ లో కూడా ప్రత్యర్థి దాదాపు గెలిచినంత పనిచేశాడు. గేమ్‌ టై బ్రేకర్‌ వరకు వెళ్లింది. చివరికి కిదాంబి 24-22 తేడాతో గేమ్‌ను గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy