చైనా చెబుతోంది: జాగ్రత్త సుమా.. మన వాళ్లక్కడ

chinees“జాగ్రత్తగా ఉండండి.. ఎక్కడికెళ్లినా ఐడెంటీ కార్డులను దగ్గర ఉంచుకోండి. అనవసరంగా బయట తిరగొద్దు. అత్యవసర సమయాల్లో మన ఎంబసీని సంప్రదించండి”… ఇవన్నీ ఎవరి కోసమో తెలుసా.. భారత్ లోని చైనీయుల కోసం. సిక్కిం సరిహద్దుల్లో భారత్‌-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత్‌లోని తమ ప్రజలకు భద్రతాపరమైన సూచనలు చేసింది చైనా. ఈ మేరకు ఢిల్లీలోని చైనా ఎంబసీ శనివారం నాడు సేఫ్టీ అడ్వైజరీని జారీ చేసింది. వ్యక్తిగత భద్రతపై దృష్టి పెట్టాలని, దేశంలో అనవసర ప్రయాణాలు చెయ్యొద్దని సూచించింది. కుటుంబసభ్యులు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవాలని సూచించినట్లు మీడియా వర్గాల సమాచారం.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy