చైనా రూల్ : పిల్లల్ని కనలేదో టాక్స్ కట్టాల్సిందే

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనా తన స్థానాన్ని సుస్థిరంగా కాపాడుకునేలా చూస్తోంది. ఆ దేశ జనాబా పెరిగిపోతున్న క్రమంలో ఇటీవల ఇద్దరి కంటే ఎక్కువ పిల్లల్ని కనవద్దంటూ ప్రచారం చేసింది చైనా ప్రభుత్వం. అయితే ఈ నిర్ణయాన్ని చైనా ప్రభుత్వం వెనక్కి తీసుకోవడమే కాకుండా..  దేశంలో పిల్లల్ని కనని తల్లిదండ్రుల నుంచి టాక్స్ వసూలు చేయాలని అధికారులను ఆదేశించింది.

ప్రపంచ జనాభాలో 150 కోట్ల జనాభా దాటి నంబర్‌వన్‌ గా నిలిచిన చైనా.. ఒకప్పుడు ఇద్దరు లేక ఒక్కరు చాలు ఇటూ ప్రచారం చేసింది.  జనాభా అదుపు చేయడమే లక్ష్యంగా రకరకాల ఫ్యామిలీ ప్లానింగ్ రూల్స్ తీసుకొచ్చింది.  అసలు పిల్లలనే కనని తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో ఆసరాగా నిలుస్తామని హామీలు కురిపించింది. ఇప్పుడు చైనాలో రకరకాల కారణాల వల్ల జనభా రేటు పడిపోయింది. యువకుల కన్నా వృద్ధుల సంఖ్య ఎక్కువైంది. దీంతో మళ్లీ జనాభాను పెంచాలనే ఆలోచనలు చేస్తున్నది.

ఈ క్రమంలోనే పిల్లలను కనని తల్లిదండ్రుల నుంచి టాక్స్ వసూలు చేయాలని నిర్ణయించింది. ఇద్దరు పిల్లలను కనకపోతే మెటర్నిటీ  టాక్స్ వసూలు చేయాలని, పిల్లలను కన్నవాళ్లకి ఆ నిధి నుంచి సహాయం అందించాలని తెలిపారు నాంజింగ్ యూనివర్సిటీ అర్థశాస్త్ర ప్రొఫెసరు లియూ జిబియావ్ . దీనిపై చైనా ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జనాభా పెంచడమే లక్ష్యమైతే నాలుగేసి బిడ్డలు పుట్టేలా కృత్రిమ గర్భాలకు వీలు కల్పించవచ్చు.. కదా అని కొందరు సోషల్ మీడియా వేదికగా చైనా ప్రభుత్వం మీద జోకులు వేస్తున్నారు.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy