చైన్ స్నాచర్లపై పీడీ యాక్ట్

30eba23459fe9744c04696f5587e9d34కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న చైన్ స్నాచర్ల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు పోలీసులు. దొంగల పని పట్టేందుకు పట్టణాలు, నగర శివార్లలో చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంతర్రాష్ట్ర ఫోన్ కాల్స్ ను అబ్జర్వేషన్ లో పెట్టడంతో పాటు దొంగలపై పీడీ యాక్ట్ కేసులు పెట్టాలని డిసైడ్ అయ్యారు.

చైన్ స్నాచర్లపై నజర్ పెట్టారు పోలీసులు. రాష్ట్రంలో రోజు రోజుకు గొలుసు దొంగతనాలు పెరిగిపోతుండటంతో… దొంగలపై ప్రత్యేక నిఘా పెట్టేందుకు రెడీ అయ్యారు. ఇందుకోసం నగరాలు, పట్టణ శివార్లలో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ప్రత్యేక బృందాలను కూడా రంగంలోకి దించారు. ఇక హైదరాబాద్ లో 150 సీసీతో పాటు దానికంటే ఎక్కువ సామర్థ్యమున్న టూ వీలర్స్ పై ప్రత్యేక డ్రైవ్ చేయాలని డిసైడ్ అయ్యారు.

ఇటీవల జరుగుతున్న వరుస దొంగతనాలు.. అంతర్రాష్ట్ర ముఠాల పనేనని పోలీసుల విచారణలో తేలింది.  అంతేకాదు ఇతర రాష్ట్రాల నుంచి టూ వీలర్ వెహికిల్స్ ను లారీల్లో తీసుకువచ్చి దొంగతనాలకు చేస్తున్నారని.. పోలీసుల కస్టడీలో ఉన్న స్నాచర్లు తెలిపారు. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే టూ వీలర్స్, ఫోన్ కాల్స్ పై అబ్జర్వేషన్ పెట్టాలని నిర్ణయించారు. ఇక దొంగలపై చోరీ కేసులు కాకుండా.. పీడీ యాక్ట్ కింద కేసులు పెట్టాలనుకుంటున్నారు. పీడీ యాక్ట్ తో పాటు కనీసం ఏడాదిపాటు జైళ్లో ఉండేలా చర్యలు చేపట్టారు. ఫస్ట్ టైం దొరికిన దొంగలపై పీడీయాక్ట్ పెట్టే అవకాశం లేకపోవడంతో.. వారిపై చోరీ కేసులు పెట్టి ఆర్నెళ్లు జైలుకు పంపాలని చూస్తున్నారు. శాసనమండలిలో చైన్ స్నాచింగ్ లపై చర్చ జరగడంతో..ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు చైన్ స్నాచర్లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy