చౌక ధరల్లో వస్తున్నాం : అన్ని రంగాల్లోకి షియోమి కంపెనీ

xiaomiandexpansionచైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమి భారత్ లో తన వ్యాపారాన్ని వివిధ రంగాలలో విస్తరించాలనుకొంటుంది. షియోమి కంపెనీ భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాలు, పేమెంట్ల రంగాలతో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాలనుకొంటుంది. . తన సర్వీసులను బ్యాంక్ పేమెంట్,మొబైల్ నెట్ వర్క్ ఆపరేటింగ్, ప్యాషన్, టాయ్స్,సూట్ కేస్,ల్యాప్ టాప్ ల తయారీ మొదలగు రంగాలలో తన సర్వీసులను ప్రారంభించనుంది. ఇండియాలోని 100 స్టార్టప్స్ లో 1 బిలియన్ డాలర్లు ఒకే ఏడాదిలో పెట్టుబడి పెట్టాలని షియోమి సీఈవో లీజన్ ప్రకటించిన కొన్నిరోజులకే షియోమి నుంచి ఈ ప్రకటన వచ్చింది. ట్రాన్స్ పోర్ట్ రంగానికి అవసరమైన అన్ని రకాల వాహనాలను , స్పేర్ పార్ట్ లను, ఎలక్ట్రిక్ తో నడిచే వాహనాలను తీసుకురానున్నామని కంపెనీ ప్రకటించింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy