చ‌రిత్ర‌కే ప‌రిమితం కానున్న బోయింగ్- 747

boeing 2బోయింగ్ 747… ఈ రాకాసి విహంగం విమానాయాన సంస్థ‌లో ఓ చ‌రిత్ర సృష్టించింది. రాయల్ ఫ్యామిలీస్ నుంచి అగ్రరాజ్యపు అధినేతల వరకు ఈ విమానాన్ని వాడారు. 50 ఏళ్ల క్రితం తొలిసారిగా గాల్లోకి ఎగిరిన ఈ విమానం ఆ త‌ర్వాత విమాన‌యాన రంగంలో ఎన్నో సేవ‌లందించింది. 1969లో తొలి 747 ఎయిర్ క్రాఫ్ట్‌ను త‌యారు చేసిన బోయింగ్ సంస్థ ఆ త‌ర్వాత 15వేల విమానాల‌ను ఉత్ప‌త్తి చేసింది. ఒకేసారి 660 మంది ప్ర‌యాణికుల‌ను మోసుకెళ్ల‌గ‌ల‌దు. అందుకే దీన్ని జంబో జెట్ అని ముద్దుగా పిలుచుకుంటారు.

boeing 1ఇప్పుడు బోయింగ్ 747 ఎయిర్ క్రాఫ్ట్‌లు చ‌రిత్ర‌కే ప‌రిమితం కానున్నాయి. ఈ త‌ర‌హా విమానాల‌ కోసం ఆర్డ‌ర్లు లేక‌పోవ‌డంతో వీటి త‌యారీని ఆపివేసేందుకు అడుగులు వేస్తోంది బోయింగ్ యాజ‌మాన్యం. ఏయిర్ బ‌స్ ఏ- 380, బోయింగ్‌-787 డ్రీమ్‌లైన‌ర్ల‌కు విమానాయాన సంస్థ‌ల నుంచి ఎక్కువ ఆర్డ‌ర్స్ రావ‌డంతో బోయింగ్ 747 విమానం క‌నుమ‌రుగు కానుంది.  గ‌తేడాదితో పోలిస్తే ఈ సంవ‌త్స‌రం కేవ‌లం 3 విమానాల‌కే ఆర్డ‌ర్లు వ‌చ్చాయ‌ని…ఇదే స‌మ‌యానికి గ‌త సంవ‌త్స‌రం 9 విమానాలు త‌యారు చేసిన‌ట్లు బోయింగ్ కంపెనీ తెలిపింది. 2019 నుంచి నెల‌కు ఒక్క విమానం త‌యారు చేసే యోచ‌న‌లో ఉంది సంస్థ‌.

 

 

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy