ఛత్తీస్‌గఢ్ గవర్నర్ బలరామ్‌జీ కన్నుమూత

ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర గవర్నర్ బలరామ్‌జీ దాస్ టాండన్ కన్నుమూశారు. 90 ఏళ్లు వయస్సున్నఆయన తీవ్ర అనారోగ్యానికి గురవడంతో చికిత్స కోసం మంగళవారం (ఆగస్టు-14) ఉదయం రాయ్‌పూర్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ టాండన్ తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. గవర్నర్ టాండన్ మృతిపట్ల ఆ రాష్ట్ర సీఎం రమణ్‌సింగ్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

బలరామ్‌జీ దాస్ టాండన్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. జనసంఘ్ స్థాపించిన సభ్యుల్లో టాండన్ కూడా ఒకరు. బీజేపీలో ఆయన కీలక పదవుల్లో పని చేశారు. పంజాబ్ కు డిప్యూటీ సీఎంగా కూడా సేవలందించారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఎమర్జెన్సీ సమయంలో జైలు జీవితం గడిపారు. ఛత్తీస్‌గఢ్ గవర్నర్ గా 2014, జులైలో నియామకం అయ్యారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy