ఛత్తీస్ గఢ్ లో కాల్పులు..మావోయిస్టు మృతి

కొద్ది రోజులుగా పోలీసులకు …మావోయిస్టులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి.ఇరువురికి మధ్య జరుగుతున్న కాల్పుల్లో పోలీసులతో పాటు మావోయిస్టులు చనిపోతున్నారు. ఈ క్రమంలోనే బుధవారం(జూలై-18) ఉదయం ఛత్తీస్‌గఢ్‌లోని కోకా పోలీసు స్టేషన్ పరిధిలో పోలీసులకు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. మృతి చెందిన మావోయిస్టుపై రూ. 5 లక్షల రివార్డు ఉంది. ఘటనా స్థలం నుంచి ఒక రైఫిల్‌తో పాటు ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కోసం పోలీసులు ఇంకా కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy