ఛత్తీస్ గఢ్ లో తుపాకుల మోత..మహిళా మావోయిస్టు మృతి

జవాన్ల ఎదురు కాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతి చెందిన సంఘటన గురువారం (ఆగస్టు-16)న
ఛత్తీస్‌ గఢ్‌ ఏజెన్సీలో జరిగింది. చత్తీస్‌ గఢ్, దంతేవాడ జిల్లా భాన్సీ.. మాసపార అటవీప్రాంతంలో గ్రామస్తులతో మావోయిస్టులు సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు జవాన్లకు సమాచారం తెలిసింది. ఈ మేరకు DRG, STF బలగాలు ఆ ప్రాంతంలో గాలింపులు చేపట్టాయి.

అక్కడ సమావేశానికి ఏర్పాట్లు నిర్వహిస్తున్న మావోయిస్టులు జవాన్ల రాకను గమనించి పారిపోయే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. జవాన్లపై కాల్పులు జరుపుతూనే మావోయిస్టులు దట్టమైన అటవీ ప్రాంతంలోకి పరుగులు తీశారు. ఈ కాల్పులో ఒక మహిళా మావోయిస్టు మృతి చెందింది. జవాన్లు సంఘటన స్థలం నుంచి మావోయిస్టు మృతదేహంతో పాటు మారణాయుధాలను స్వాధీన పరుచుకున్నట్లు తెలిపారు జిల్లా SP అభిషెక్ పల్లవ్. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy