జంతువులు కూడా తమ ముఖాన్ని అద్దంలో చూసుకుంటాయి..!!

animals-in-mirrors_650x360_51433402612మన ఇంట్లో ఉండే పెట్ జంతువులు అద్దంలో తమ ముఖాలను చూసుకొని చేసే రకరకాల విన్యాసాలు అంతా ఇంతా కాదు. అటువంటి విన్యాసాలను మనం వీడియోలో బంధించి మరీ నవ్వుకుంటాం. మరి అడవిలో ఉండే జంతువుల గురించి? ఆ.. ఆ డౌటే వచ్చింది ఓ ఫ్రెంచ్ ఫోటోగ్రాఫర్ కి. అంతే.. తన భార్యతో కలిసి ఆఫ్రికా అడవులకు వెళ్లినపుడు ఇటువంటి ప్రయోగాన్ని చేశాడట. ఆ అడవిలోని కొన్ని ప్రదేశాల్లో కొన్ని అద్దాలను పెట్టి వచ్చాడట. ఆ అద్దాలకు పక్కనే కెమెరాలనూ అమర్చాడట. ఇక ఒక్కో జంతువు వచ్చి చేసే విన్యాసం అంతా ఇంతా కాదు. గొరిల్లాలు, చిరుత, ఏనుగు, చింపాంజీలు అన్ని ఆ మిర్రర్ దగ్గరికి వచ్చి తమను తాము చూసుకొని రకరకాల విన్యాసాలు చేశాయి. దీన్ని ఓ వీడియోగా చేసి మనోడు యూట్యూబ్ లో పెట్టాడట. ఇగ చూసుకోండి.. ఆ వీడియోను ఇప్పటికి 86 లక్షల మంది వీక్షించారు.. మీరూ ఓ సారి వీక్షించి నవ్వుకోండి మరి.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy