జగత్ కంత్రీలు ఈ ఆడోళ్లు : తప్పించుకోవటానికి నడిరోడ్డుపై విప్పేశారు

Thieving-Sisters-Tear-Off-Clothes-To-Evade-Arrestవాళ్లు ఆడోళ్లు.. అయితే మాములోళ్లు మాత్రం కాదు. కంత్రీలకే కంత్రీలు. అందులోనూ అక్కా చెల్లెళ్లు. ముంబైలో మోస్ట్ వాంటెడ్ లేడీ దొంగలు. ముంబై సిటీలోనే ఇప్పటి వరకు 10 దొంగతనాలతో హడలెత్తించారు. ఏడాది కాలంగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నారు. దొంగతనం – దొంగతనం మధ్య కనీసం 20 రోజులు టైం తీసుకుంటారు. పోలీసులకు క్లూస్ కూడా ఇవ్వరు. ఉద్యోగం చేసే మహిళల్లాగే ఉంటారు.. ఇలాంటి కంత్రీ లేడీస్ ను పట్టుకోవటం సవాల్ గా మారింది. అనుకోకుండా ఓ రోజు.. ఇద్దరు మహిళల్లో ఒకరు పోలీస్ కంట్లో పడ్డారు. అయినా ఆ మహిళ అదరలేదు.. బెదరలేదు.. సీన్ రివర్స్ చేసింది.. ఖాళీలకే షాక్ ఇచ్చింది.. పూర్తి వివరాల్లోకి వెళితే..

సరిత, సుజాత ఇద్దరు అక్కాచెలెళ్లు. ముంబైలో నివాసం. ఉద్యోగం పేరుతో ధనవంతులు ఉండే ప్రాంతాల్లో రెక్కీ నిర్వహిస్తారు. అవకాశం ఉన్న ఇంట్లోకి చొరబడి.. దొరికిందంతా దోచేస్తారు. ఇప్పటికే 10 ఇళ్లల్లో దొంగతనాలు చేసి హ్యాపీగా బతికేస్తున్నారు. జూన్ 30వ తేదీ బోరివిలి ప్రాంతంలోని కస్తూర్బా మార్గ్ ఏరియాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో దొంగతనం చేశారు. ఫస్ట్ టైం.. సీసీ కెమెరాలో వీరి ముఖాలు స్పష్టంగా కనిపించాయి. దీంతో పోలీసులు కేసును సవాల్ గా తీసుకున్నారు. కస్తూర్బా పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇన్ స్పెక్టర్ విచారణ కోసం.. మలాద్ స్టేషన్‌కు వచ్చారు. సీసీ కెమెరా విజువల్స్ పరిశీలించిన వెనుతిరిగి వెళుతున్నారు. సరిగ్గా ఆ టైంలోనే..  డైమండ్ మార్కెట్ ఏరియాలో ఈ లేడీ కిలాడీలు కనిపించారు. డౌట్ లేదని క్లారిటీ వచ్చాడు. అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. అక్కడే సీన్ రివర్స్.. పోలీసులపై ఈ దొంగ లేడీలు తిరగబడ్డారు.

పోలీసుల నుంచి తప్పించుకునేందుకు నడిరోడ్డుపై.. మిట్ట మధ్యాహ్నం బట్టలు విప్పేశారు. అందరూ షాక్. లైంగికంగా వేధిస్తున్నారు అంటూ పోలీసులపైనే తిరగబడ్డారు. ఆడ దొంగలు.. మగ పోలీసులు.. అందులోనూ అందరూ తమ స్మార్ట్ ఫోన్లలో రికార్డ్ చేస్తున్నారు. దుస్తులు విప్పేస్తూ హంగామా చేస్తున్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు. అలాంటి టైంలోనూ.. వారు తప్పించుకోకుండా మగ పోలీసులు చుట్టూ రౌండప్ చేశారు. అలా 20 నిమిషాలు సీన్ నడిచింది. ఈలోపు ఆడ పోలీసులు వచ్చారు. నాలుగు పీకారు. సీన్ పోలీస్ స్టేషన్ కు చేరింది. ఇప్పటి వరకు చేసిన 10 దొంగతనాల్లో రూ.20 లక్షల విలువైన డబ్బు, ఆభరణాలు కొట్టేసినట్లు ఒప్పుకున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy