జగన్ చేసింది విలాసయాత్ర.. ప్రతివారం ఇంటికెళ్లాడు : చంద్రబాబు

అమరావతి : వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసింది పాదయాత్ర కాదు.. జగన్ ది విలాసయాత్ర అని విమర్శించారు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. ‘జగన్ ప్రతి శుక్రవారం ఇంటికెళ్లాడు.. కానీ నేను 208రోజులు ఇంటికెళ్లకుండా పాదయాత్ర చేశాను. పవిత్ర లక్ష్యంతో నేను పాదయాత్ర చేశాను. పాదయాత్ర పవిత్రతనుజగన్ దెబ్బతీశారు” అని విమర్శించారు. ప్రత్యేక హోదా గురించి జగన్ మాట్లాడటం లేదని చంద్రబాబు అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తో కలిసి ఏపీకి హోదా సాధిస్తా అని చెప్పిన జగన్ చిత్తశుద్ధి ఏంటో ప్రజలకు అర్థమైందన్నారు.

ఈనెల 18వ తేదీన ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహణపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర టీడీపీ బాధ్యులు దీంట్లో పాల్గొన్నారు. ఎన్టీఆర్ 23వ వర్ధంతిని ఘనంగా జరపాలని బాబు సూచించారు. నాలుగేళ్లుగా నిర్వహిస్తున్న లెజెండరీ రక్తదాన శిబిరాలను.. ఈసారి కూడా నాయకులు, కార్యకర్తలు కలిసి విజయవంతం చేయాలన్నారు.

వైఎస్ఆర్ ది కథ.. ఎన్టీఆర్ ది చరిత్ర : చంద్రబాబు

ఈ ఏడాది ఎన్టీఆర్ బయోపిక్ సినిమా రావడం ఒక మైల్ స్టోన్ లాంటిదన్నారు చంద్రబాబు. ఎన్టీఆర్ బయోపిక్  అందరికీ స్ఫూర్తినిస్తుందని చెప్పారు.  త్వరలో విడుదలకాబోతున్న వైఎస్ఆర్ బయోపిక్ ను పరోక్షంగా విమర్శించిన చంద్రబాబు.. ‘మిగిలిన వాళ్లది అందరి మాదిరిగా ఒక కథ. కానీ ఎన్టీఆర్ ది మాత్రం ఒక చరిత్ర’ అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతిని పేదల పండుగగా.. చరిత్రాత్మకంగా చేయాలన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను టీడీపీ చిత్తశుద్దితో అమలు చేస్తోందన్నారు. పేదల సంక్షేమాన్ని తరువాత దశకు చేర్చామన్నారు. ‘పింఛన్ ను రూ.200 నుంచి రూ.2వేలకు పెంచాం. పేదల్లో 10రెట్లు సంతృప్తి నింపాం. వికలాంగులకు నెలకు రూ.3వేలు ఇస్తాం. డయాలసిస్ పేషంట్లకు రూ.3,500ఇస్తాం. రైతులకు 9గం కరెంటు సరఫరా ప్రకటించాం. అందరికీ స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నాం. అవినీతి రహిత రాష్ట్రాలలో 3వ స్థానం సాధించాం’ అన్నారు. కేంద్రం సహాయం లేకున్నా.. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుచేశామన్న చంద్రబాబు.. ఒక్కరోజే రూ.లక్ష కోట్ల పెట్టుబడులు తెప్పించి.. లక్షా 30వేల మందికి ఉపాధి కల్పించి.. చరిత్ర సృష్టించామన్నారు. విశాఖలో రూ.70వేల కోట్లతో డేటా సెంటర్ పార్కులు, సోలార్ పార్కుల అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రకాశంజిల్లాలో రామాయ పట్నంలో కాగిత గుజ్జు పరిశ్రమ ఏర్పాటుచేస్తున్నామన్నారు. కృష్ణానదిపై రూ.1387కోట్లతో ఐకానిక్ బ్రిడ్జికి శంకుస్థాపన చేస్తున్నామన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్లాలని సూచించారు చంద్రబాబు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy