జనం చితక్కొట్టారు పాపం : దెయ్యాల వేషంలో అర్థరాత్రి షూటింగ్

horror-short-filmఏపీ రాష్ట్ర రాజధాని బెజవాడ. ఏలూరు రోడ్డు. ఆరుగురు కుర్రోళ్లు.. అందరి వయస్సు 20 ఏళ్లు మాత్రమే. ఈ వయస్సు ఎలా ఉంటారు.. వాళ్లు ఆలోచనలు ఎలా ఉంటాయి.. గుర్రాలై పరిగెత్తుతాయి. అందులోనూ సోషల్ మీడియా వచ్చిన తర్వాత వారి ఆలోచనలకు దృశ్యరూపం కూడా తోడైంది. ఇంకేముందీ.. ఓ హార్రర్ షార్ట్ ఫిల్మ్ తీయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఆరుగురు ఫ్రెండ్స్ కలిసి స్క్రిప్ట్, కెమెరాలు సిద్ధం చేసుకున్నారు. ఆ వెంటనే ఇద్దరకి దెయ్యాల వేషం వేశారు. వీళ్లద్దరూ మే 25వ తేదీ గురువారం అర్థరాత్రి ఏలూరు రోడ్డుపైకి వచ్చారు. దెయ్యాల వేషంలో వారు తిరుగుతూ ఉన్నారు. అర్థరాత్రి.. నడిరోడ్డుపై దెయ్యాలు అంటూ జనం భయపడిపోయారు.

అసలే అంతరాష్ట్ర దొంగలు అని.. పిల్లలను ఎత్తుకెళ్లేవారు తిరుగుతున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఇలా రోడ్లపై దెయ్యాల వేషంలో తిరగటంతో.. జనం వణికిపోయారు. ఏలూరు రోడ్డులోని స్థానికులు అందరూ కలిసి వారిని పట్టుకున్నారు. అందర్నీ చితక్కొట్టారు. దెయ్యాల వేషంలో ఉన్న వారిని కొడుతుండటంతో.. దూరంగా ఉండి కెమెరాలతో షూటింగ్ చేస్తున్న మిగతా నలుగురు కుర్రోళ్లు కూడా వచ్చారు. ప్రజలకు సర్దిచెప్పటానికి ప్రయత్నించారు. అయినా స్థానికులు వినలేదు. మాచవరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పెట్రోలింగ్ సిబ్బంది అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.

ఈ కుర్రోళ్లు నిజంగా షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. షార్ట్ ఫిల్మ్.. ఎంత పని చేసింది అంటున్నారు ఆ యువకులు. అసలే కొత్తవాళ్లు కనిపిస్తే చాలు రెచ్చిపోతున్నారు జనం.. అలాంటి టైంలో దెయ్యాల వేషంలో కనిపిస్తే బతకనిస్తారా.. హర్రర్ షార్ట్ ఫిల్మ్ ఏమోగానీ.. వీరికి జనం నిజంగా క్రైం సినిమా చూపించారు..

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy