జనం ముందుకు మరిన్ని కీలక డాక్యుమెంట్లు

downloadనేతాజీ డెత్ మిస్టరీ పై డౌట్స్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తోంది వెస్ట్ బెంగాల్ సర్కార్. నేతాజీ డెత్ కు సంబంధించి ప్రభుత్వం దగ్గర ఉన్న ఆధారాలన్ని ఒక్కోక్కటిగా బయటపెడుతోంది. 1938 నంచి 1947 వరకు బెంగాల్ కేబినెట్ లో బోస్ పై చర్చించిన రహస్యమైన కీలక డాక్యూమెంట్లను ప్రజలముందుంచింది. నేతాజీ కి సంబంధించి ఇప్పటికే 64 ఫైళ్లను రిలీజ్ చేసింది బెంగాల్ ప్రభుత్వం..ఇప్పుడు మరికొన్ని కీలక దస్త్రాలను వెబ్ సైట్లో పెట్టింది. మొత్తం 12 వేల 744 ఫైళ్లను రిలీజ్ చేసింది సర్కార్. డాక్యూమెంట్లన్ని డీవీడీలో బోస్ ఫ్యామిలీ మెంబర్స్ కు అందించింది బెంగాల్ సర్కార్ . అలాగే కోల్ కతాలోని పోలీసు మ్యూజియంలో కూడా అందుబాటులో ఉంచారు. కేబినెట్ ఫైల్స్ ఆధారంగా 1948 వరకు బోస్ జీవించే  ఉన్నట్లు తెలుస్తోంది. చైనాలోని మంచురియా ప్రాంతంలో …తలదాచుకున్నట్లు అర్థమౌతోంది. ఇండియన్ నేషనల్ ఆర్మీలో బోస్ తో పనిచేసిన దేవ్ నాథ్ అనే అధికారి ఇదే విషయాన్ని 1948 ఆగస్టు 9న చెప్పినట్లు డాక్యూమెంట్ల చెబుతున్నాయి….అయితే టోక్యో రెడియో మాత్రం 1945 ఆగస్టు 18న బోస్ విమాన ప్రమాదంలో చనిపోయినట్లు ఆగస్టు 22..1945లో ప్రకటన చేసింది. అప్పటి నుంచే నేతాజీ డెత్ మిస్టరీగా మారింది.

netaji_files_480

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy