జననేత జగ్జీవన్ రామ్

downloadబాబు జగ్జీవన్ రామ్ సేవలు దేశానికి ఆదర్శం.దళితుల కోసం పోరాడారు… దళితుల కోసమే బతికారు. అంటరానితనాన్ని తరిమిగొట్టేందుకు అంబేద్కర్ తో సమానంగా పోరాటం చేశారు. యాభై సంవత్సరాల రాజకీయ జీవితంలో… ముప్పై ఏళ్లు రకరకాల పదవులు చేపట్టారు. ఎన్నికల్లో ఒక్కసారి కూడా ఓటమి పొందలేదు.

1908 ఏప్రిల్  బీహార్ రాష్ట్రంలో చాండ్వా అనే గ్రామంలో జన్మించారు. ఆరోజుల్లో… దళితులను అగ్ర వర్ణాలకు చెందిన వారు చిన్నచూపు చూసేవారు. దళితుడైన బాబూజీ..  తన సహమిత్రులను చూసి చిన్న వయస్సులోనే చాలా బాధ పడ్డారు. దళితులను చిన్నచూపు చూసేవారిపై ఉద్యమం మొదలుపెట్టారు.తన రాజకీయ జీవితం మొత్తం దీనికే అంకితం చేశారు. విద్యార్థిగా ఉన్నప్పుడే రాజకీయాలల్లో అడుగేశారు. సామాజిక ఉద్యమాలు చేశారు. స్వతంత్రం కోసం పోరాడారు. ముప్పై ఏళ్లు కేంద్ర ప్రభుత్వంలో పనిచేసిన జగ్జీవన్ రామ్…  పార్లమెంటరీ సెక్రటరీ స్థాయి నుంచి… దేశ ఉప ప్రధానమంత్రి వరకు మంచి మంచి పదవులు పొందారు. దళితులని పేరుపడ్డవాళ్లకు ఓటు హక్కు కల్పించేందుకు తీవ్రంగా కృషి చేశారు. వాళ్లకు జీతాలు కూడా ఇవ్వాలని పోరాడారు.

అప్పట్లో అందరికి గాంధీజీ రోల్ మోడల్. స్టూడెంట్ గా ఉన్నప్పటినుంచే.. గాంధీ చూపించిన అహింస మార్గంలో నడిచారు బాబూజీ. 1930లో సత్యాగ్రహ ఉద్యమం చేశారు. 27 ఏళ్ల వయసులోనే అంటే 1935 లో.. బీహార్ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. 1936లో ఎంపీ అయ్యారు.  స్వతంత్రం తర్వాత వచ్చిన నెహ్రూ కేబినెట్ లో ఉన్న అతి చిన్న మంత్రి కూడా ఈయనే. బాబూజీ కార్మిక మంత్రిగా తొలిసారి పనిచేశారు. 1947లో జెనీవా నగరంలో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషనోళ్లు పెట్టిన అంతర్జాతీయ కాన్ఫరెన్స్ లో బాబూజీ మాట్లాడారు. 1971లో భారత్-పాక్ యుద్ధ సమయంలో రక్షణ మంత్రిగా ఉన్నారు. దేశంలో హరిత విప్లవం తీసుకురావడంలో వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు.  కాంగ్రెస్ కు, ఇందిరాగాంధీకి నమ్మిన బంటులా ఉండేవారు జగ్జీవన్ రామ్. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ తోనే ఉన్నారు. 1977ల కాంగ్రెస్ లో నుంచి బయటికొచ్చి.. కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ పార్టీని స్ధాపించారు. చివరికి జనతా పార్టీలో కలిపేశాడు. 1977 నుంచి 79 వరకు మొరార్జీ దేశాయ్ పాలనలో.. ఉపప్రధానిగా పనిచేశారు. మొట్టమొదలు ఉప ప్రధాని అయిన దళితుడు బాబూజీనే. 1936 నుంచి 1986 వరకు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. అది ఇప్పటికీ వరల్డ్ రికార్డే . 30 సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా చెయ్యడం కూడా ఓ రికార్డే.  ఐతే… ప్రధానమంత్రి కావాలన్న ఆయన కల.. అందినట్టే అంది దూరమైంది. 1979 లో లోక్ సభలో అవిశ్వాస తీర్మానంతో ప్రధాని పదవి నుంచి మొరార్జీ దేశాయ్ దిగిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో ఉప ప్రధానిగా ఉన్నారు జగ్జీవన్ రామ్.. ప్రధాని ఇతనే అనుకున్నరందరు. ఐతే.. ఆ పోస్ట్ చరణ్ సింగ్ కు దక్కింది. జనతాపార్టీకి పార్లమెంటరీ పార్టీ నేతగానే జగ్జీవన్ రామ్ ఉండిపోయారు. 1986 జులై ఆరో తేదీన 78 వయస్సులో.. జగ్జీవన్ చనిపోయారు. 50 ఏళ్ల రాజకీయ జీవితంలో బాబూజీకి ఒక్క మచ్చ కూడా లేదు. తెలివితో నిర్ణయాలు తీసుకుంటారు… కష్టాలల్లో ధైర్యంగా ఉంటారు.. ఏది మాట్లాడుమన్నాబాగా మాట్లాడుతారు… ఎక్స్ పార్టీవాళ్లతోనే ప్రశంసలు పొందారు. అందుకే.. ఈయన లా ఇంకెవ్వరు లేరంటారు అందరూ. ఈ తరం నాయకులందరూ ఆయన్ను చూసి ఎంతో నేర్చుకోవాలని చెబుతారు..

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy