జనవరి 26 కు హై అలర్ట్

republic-dayభారత్ లో మరిన్ని దాడులకు టెర్రరిస్టులు ప్లాన్ చేసినట్టు నిఘాసంస్థలు తేల్చాయి. సరిహద్దు ప్రాంతాల్లోని కంటోన్మెంట్లు, ఎయిర్ బేస్ లను ఉగ్రవాదులు టార్గెట్ గా చేసుకున్నారని హెచ్చరిస్తున్నాయి. ఇక రిపబ్లిక్ డే నాడు… ఢిల్లీ సహా దేశంలోని వివిధ ప్రాంతాల్ల జేషే మహ్మద్, లష్కరే తోయిబా లాంటి తీవ్రవాద సంస్థలు… దాడులు చేయొచ్చని… నిఘావర్గాలంటున్నాయి. ఇంటెలీజెన్స్ హెచ్చరికలతో… అధికారులు అలర్ట్ అయ్యారు. సరిహద్దులు సహా దేశంలోని ప్రధాన నగరాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. ఢిల్లీలో దాదాపు 10వేల మంది పారామిలటరీ బలగాలను మోహరించారు. రిపబ్లిక్ డే సెలెబ్రేషన్స్ కు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హొలాండే చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు. దీంతో… గణతంత్ర వేడకులను టెర్రరిస్టులు లక్ష్యంగా చేసుకునే ఇంటెలీజెన్స్ హెచ్చరించింది. దాదాపు 15 మంది ఉగ్రవాదులు ఇప్పటికే దేశంలోకి చొరబడ్డారని భావిస్తున్నారు. వీరిలో ఇద్దరు ఢిల్లీలోకి ప్రవేశించారన్న సమచారం నిఘా అధికారుల దగ్గర ఉంది. దీంతో ఢిల్లీ మొత్తం సెక్యూరిటీ కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదులు డ్రోన్ దాడులకు పాల్పడొచ్చని నిఘా పాల్పడొచ్చని నిఘా సంస్థలు హెచ్చరిస్తున్నాయి. సరిహద్దుల్లోని కంటోన్మెంట్లు, ఎయిర్ బేస్ లలో హైఅలర్ట్ కొనసాగిస్తున్నారు.  రాజస్థాన్ లోని అంలతర్జాతీయ సరిహద్దుల వెంబడి… బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులు నిన్న ఆపరేషన్ కోల్డ్ ప్రారంభించారు. దట్టమైన మంచు, చలి వాతావరణాన్ని ఆసరాగా చేసుకుని సరిహద్దుల్లో ఉగ్రవాదుల చొరబాట్లను నివారించేందుకు ఆపరేషన్ కోల్డ్ ను ప్రతీఏటా BSF నిర్వహిస్తోంది. జనవరి 17 నుంచి 30వరకు జరగాల్సిన ఈ ఆపరేషన్ ను పఠాన్ కోట్ దాడితో 6రోజులు ముందుగానే ప్రారంభించారు. ఉగ్రదాడుల హెచ్చరికలతో… ప్రధాన రక్షణ స్థావరాలు, ప్రముఖ ప్రదేశాల్లో సెక్యూరిటీ టైట్ చేశారు. ఇస్రో, అణువిద్యుత్ కేంద్రాలు దగ్గర సైనిక బలగాలను మోహరించారు.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy