
ఇక కుటుంబం కోసం, తనమీద ఆధారపడ్డ సిబ్బంది కోసమే సినిమాల్లో నటిస్తున్నానన్నారు పవన్. తనకు సినిమాలన్నా, సినీ పరిశ్రమన్నా చానా గౌరవమని చెప్పారు. జనం సమస్యలు తీర్చడానికి అవసరమైతే సినిమాలు కూడా వాయిదా వేస్తానని పవన్ చెప్పుకొచ్చారు.
జనసేన పార్టీ కోసం అనంతపురం నుంచి స్పీకర్లు, కంటెంట్ రైటర్లు, అనలిస్టులుగా పనిచేసేందుకు అనంతపురం జిల్లా నుంచి వచ్చిన నాయకులతో మాట్లాడారు పవన్ . జిల్లాలో ఏమేం సమస్యలున్నయో అడిగి తెలుసుకున్నారు పవన్.
తొందర్లనే అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేస్తానని చెప్పారు పవన్ కల్యాణ్.