జనసేన ఆధ్వర్యంలో : ఆడపడుచుల ఆత్మగౌరవ పోరాట సమితి

jena-sena
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ వార్ ఆపలేదు. ఆ మీడియా అధినేతలను ప్రశ్నిస్తూనే ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై జనసేన పార్టీ ఆధ్వర్యలోనే తెలుగు చిత్ర పరిశ్రమ ఆడపడుచుల ఆత్మగౌరవ పోరాట సమితి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పోరాట సమితికి జనసేన మహిళా విభాగం అయిన వీర మహిళా వింగ్ అండగా ఉంటుందని వెల్లడించారు.

మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ ఆడపడుచుల ఆత్మగౌరవ పోరాట సమితి పని చేస్తుందన్నారు. సినీ ఇండస్ట్రీలోని కొందరు ఆర్టిస్టులతోపాటు సామాజిక సేవా కార్యకర్తలు, మహిళా లాయర్లు, స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు ఈ పోరాట సమితిలో ఉంటారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy