జనసేన పేరుతో ఎవరొచ్చినా డబ్బులివ్వొద్దు: పవన్

Pawan-Kalyan-తమ పార్టీకి అధికార ప్రతినిధులెవరినీ నియమించలేదన్నారు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌. ఆ పేరుతో ఎవరొచ్చినా, పార్టీకి నిధులు కోరినా నమ్మొద్దని ప్రజలకు సూచించారు పవన్. పార్టీ అధికార ప్రతినిధులమంటూ కొందరు వ్యక్తులు ప్రచారం చేసుకుంటూ పార్టీ శ్రేణుల మధ్య గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారాయన. కొందరు వ్యక్తులు ఓసారి పార్టీ ప్రచార కార్యదర్శిగా, మరోసారి అధికార ప్రతినిధులమంటూ నిధుల సేకరణకు వస్తున్నారని తన ఫిర్యాదులందుతున్నాయన్నారు. మీడియాతో కూడా కొందరు ఇలాంటి పదవులతో మాట్లాడుతున్నట్లు తనదృష్టికి వచ్చిందన్నారు పవన్‌ కల్యాణ్‌. కృష్ణా జిల్లాలో ఒకరు జనసేన అధికార ప్రతినిధినంటూ పార్టీ కోసం విరాళాల వసూలుకు ప్రయత్నించారని ఆందోళన వ్యక్తం చేశారు. జనసేన శ్రేణులు, మీడియాకు వాస్తవాలు తెలిపేందుకే ఈ ప్రకటన చేస్తున్నాను. జనసేన నుంచి చర్చల్లో పాల్గొనడానికి ఎవరినీ నియమించలేదని స్పష్టం చేశారు పవన్.ఆ పేరిట వచ్చే వ్యక్తులతో, వారి మాటలతో పార్టీకి సంబంధం లేదన్నారు. జనసేన అధికార ప్రతినిధులమంటూ విరాళాలు కోరే వారి మోసకారి మాటలను విశ్వసించొద్దు.. వారి సమాచారాన్ని మాకు ఇవ్వండి అని కోరారు పవన్‌. పార్టీ నిర్మాణం కోసం అన్ని అర్హతలూ ఉన్న వ్యక్తులనే పార్టీ ప్రతినిధులుగా నియమిస్తామని చెప్పారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy