జనసేన వ్యూహకర్త దేవ్ : ఏపీలోని అన్ని సీట్లకు పోటీ

pavan1రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, 25 పార్లమెంట్ స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ ప్రకటించారు. హైదరాబాద్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో 13 జిల్లాల నేతలతో సమావేశమైన సందర్భంగా ఈ కీలక ప్రకటన చేశారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రణాళికబద్ధంగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. ఏపీలో త్వరలో పర్యటించనున్నట్లు చెప్పిన పవన్.. ఈ నెల 11న పర్యటన వివరాలు తెలుపుతానన్నారు. తెలంగాణలో కేడర్ ను బలోపేతం చేస్తున్నామని.. ఎన్నికల్లో పోటీకి సంబంధించిన ప్రాథమిక ప్రణాళిక ఆగస్టు రెండో వారంలో ప్రకటిస్తామన్నారు.

జనసేన పార్టీ రాజకీయ వ్యూహకర్త దేవ్ ను నేతలు, కార్యకర్తలు, అభిమానులకు పరిచయం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు, ఇబ్బందులపై అవగాహన రావాలంటే ఎన్నికల్లో పోటీయాల్సిందేననే నిర్ణయానికి వచ్చినట్టు చెప్పారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy