జన సంద్రంగా జంపన్నవాగు

medaramమేడారంలో జాతర సంబురాలు మిన్నంటాయి. జంపన్నవాగు జన సందోహంతో పరవళ్లు తొక్కింది. వనదేవతల దర్శనానికి జన ప్రవాహం తరలివచ్చింది. జాతరకొచ్చిన భక్తులు మొదట జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించారు. దీంతో ఆ ప్రాంగణమంతా లక్షలాది భక్తులతో నిండిపోయింది. ఒకే సారి ఐదు వేలకు పైగా భక్తులు స్నానం చేసేందుకు అనువుగా షవర్లను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన 3 కిలో మీటర్ల వరకు జంపన్న వాగుకు రెండువైపులా స్నానఘట్టాలను ఏర్పాటు చేసింది.

కన్నెపల్లినుంచి సారక్క మేడారం గద్దెకు చేరుకోవడంతో తొలిఘట్టం పూర్తయింది. మరోవైపు పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజు తరలివచ్చి మేడారం గుడి దగ్గర సారక్కకు స్వాగతం పలికారు. ఈ ముగ్గురు దేవతల రాకతో మేడారం సంబురంలో మునిగింది. దారి పొడవునా పొర్లుదండాలు పెడుతూ ప్రణమిల్లారు. ఎటు చూస్తే అటు జనమై వనమంతా తల్లులకు వందనాలు సమర్పించింది. మేడారం మహాజాతరలో తొలిఘట్టం సారక్క రాకతో ముగిసింది.

ఇవాళ(గురువారం,ఫిబ్రవరి-1) సమ్మక్కను మేడారం సమీపంలోని చిలుకల గుట్ట నుంచి గద్దెపైకి అధికారిక లాంఛనాలతో తీసుకురానున్నారు. సాయంత్రం ఈ కార్యక్రమం మొదలై రాత్రి వరకు కొనసాగుతుంది. సమ్మక్కను తీసుకొచ్చే ముందు పోలీసులు గాల్లోకి కాల్పులు జరుపుతారు. తర్వాత తల్లిని గద్దె పైకి తీసుకొచ్చి ప్రతిష్టిస్తారు. శుక్ర, శనివారాల్లో జాతర కొనసాగుతుంది. శనివారం రాత్రి గిరిజన దేవతలు వన ప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది.

సీఎం కేసీఆర్ మేడారం జాతర పర్యటన ఖరారయ్యింది. శుక్రవారం(ఫిబ్రవరి-2) మధ్యాహ్నం12.30 కి బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో బయల్దేరి 1.15కి మేడారం చేరుకుంటారు. అక్కడి నుంచి 1.25కి వాహనంలో జాతర ప్రాంగణానికి చేరుకుని సమ్మక్క,సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేస్తారు.1.50కి అక్కడి నుంచి బయల్దేరి పోలీసు క్యాంపు చేరుకుంటారు. అక్కడ భోజనం చేసి మంత్రులు, అధికారులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ బయల్దేరుతారు సీఎం కేసీఆర్.

ఇవాళ(గురువారం) ఛత్తీస్ గఢ్ సీఎం రమణ్ సింగ్ మేడారం జాతరకు రానున్నారు.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy