జన సామాన్యానికి కవచం

anna

 

నలభై ఐదు ఏళ్ళు, పది సార్లు పురిటి నొప్పుల తర్వాత నిన్న విడుదలైంది “లోక్ పాల్ బిల్లు”. 1968 లో మొదటి సారి లోక్ సభ మెట్లు తొక్కిన ఈ ప్రభుత్వ వ్యవస్థల అవినీతి వ్యతిరేక బిల్లు, పలు మార్పులు, విరమణలు, కొత్త రూపాల తర్వాత మొత్తానికి ఉభయ సభల ఆమోదం పొందింది. 2011 నుండీ అన్నా హజారే నేతృత్వంలో జన లోక్ పాల్ పేరుతొ ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమమే ఉభయ సభలలో ప్రస్తుతం బిల్లు ఆమోదించక తప్పని పరిస్థితి ఏర్పరచింది. యువత అసంఖ్యాకంగా అన్నా కు మద్దతుగా నిలవడంతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కానీ, ఎలాగైనా ప్రభుత్వం లోకి రావాలని ప్రయత్నిస్తున్న బీ జే పీ కానీ ఈ బిల్లును ఇంకా మురగబెట్టలేని స్థితిని చేరుకున్నాయి. అలా 1963 లో మొదటి సారి వినబడ్డ ‘లోక్ పాల్’ ఇప్పుడు నిజమయింది. ఈ చారిత్రాత్మక బిల్లు విశేషాలు…

  • రాష్ట్రాలన్నీ సంవత్సరంలో లోకాయుక్త వ్యవస్థలను ఏర్పరచవలసిందే
  • లోక్ పాల్ లో చైర్మన్ తో పాటు ఎనిమిది మంది సభ్యులలో నలుగురు న్యాయ వ్యవస్థ నుండి, నలుగురు బలహీన వర్గాలు, మహిళల నుండి ఉంటారు
  • సభ్యులను ఎంపిక చేసే కమిటీ లో ప్రధాని, లొక్ సభ స్పీకర్, లోక్ సభ లో ప్రతిపక్ష నాయకుడు, సుప్రీం కోర్ట్ ప్రధాన జడ్జి, మరొక ప్రత్యెక సభ్యుడు ఉంటారు
  • ఆధ్యాత్మిక కలాపాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించే సంస్థలు తప్ప ప్రజల నుండి గానీ, విదేశాలనుండి గానీ నిధులు సేకరించే సొసైటీలు కూడా ఇప్పుడు బిల్లు పరిధిలోనే ఉంటాయి
  • ప్రభుత్వ విభాగాలతో పాటు లోక్ పాల్ కు సొంత పరిశోధనా విభాగం కూడా ఉంటుంది
  • CBI పై విచారణా అధికారం ఉన్నప్పటికీ ఆ విషయాన్ని ప్రత్యెక కమిషన్ ద్వారానే లోక్ పాల్ చూస్తుంది. ఏ కేసు చూస్తున్న CBI అధికారిని కూడా లోక్ పాల్ అనుమతి లేకుండా బదిలీ చేయరాదు
  • ప్రభుత్వ ఉద్యోగులు లోక్ పాల్ ముందు తమ వాదన వినిపించవచ్చు
  • కొన్ని పరిమితులతో, ప్రత్యెక పరిస్థితుల్లో ప్రధానిని కూడా లోక్ పాల్ విచారించవచ్చు, ఈ విచారణ రహస్యంగా, కమిటీ మెజారిటీ సభ్యుల ముందే జరుగుతుంది
  • నేరం నిరూపణపై అత్యధికంగా పదేళ్ళు శిక్ష, తప్పుడు ఆరోపణలపై లక్ష జరిమానా

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy