జన హృదయ మహాకవి.. దాశరథి

dasathi-krishnamacharyaనా తెలంగాణ.. కోటి రతనాల వీణని చెప్పిన మహా కవి.. నిజాంను పిశాచిగా వర్ణిస్తూ తెలంగాణ ప్రజానీకాన్ని మేల్కొలిపిన కలం వీరుడు.. తన రచనలలో నవరసాలను పలికించి తెలుగు జనం హృదయాలను గెలుచుకున్న ధీశాలి.. ఆయనే మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు. అంతటి గొప్పాయన జయంతి సందర్భంగ వీ6 ప్రత్యేక కథనం…

నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తన కలానికి పదునుపెట్టి.. నవాబులపై పద తూటాలను ఎక్కుపెట్టిన కవి దాశరథి కృష్ణమాచార్యులు. వరంగల్ జిల్లా మరిపెడ మండలం చిన్న గూడూరులో 1925 జూలై 22న వెంకటాచార్యులు, వెంకటమ్మ దంపతులకు జన్మించారు కృష్ణమాచార్యులు. చిన్నప్పటి సందే కవిత్వంల మంచి పట్టుసాధించిన ఆయన దొరతనానికి వ్యతిరేకంగా పోరాడారు. .

దాశరథి కృష్ణమాచార్యులతో ఎప్పటికైనా ఇబ్బందేననుకున్న ఆ ఊరి జమీందార్లు ఆయన కుటుంబం మీద కక్ష పెంచుకున్నారు. వాళ్లకు ఎట్లాంటి సాయం అందుకుండా చేశారు. దీంతో ఆయన కుటుంబం ఖమ్మం జిల్లాకు మకాం మార్చింది. ఊరు మారినా దాశరథి కలానికి మాత్రం పదును తగ్గలేదు. మరింత ధైర్యం కూడదీసుకొని జనాన్ని చైతన్యవంతులను చేశారు. గ్రామాల్లో దొరల దాష్టీకాన్ని తన కలంతో ఎదిరించారు. గూడూరు ప్రజల కష్టాలపై ఆయన రాసిన పద్యాలు అప్పట్లో మొత్తం రాష్ట్రాన్నే మేల్కొపేలా చేశాయి.

దాశరథి రచనలకు ప్రభావితులైన జనం నిజాం నవాబులకు వ్యతిరేకంగా చాలా పోరాటాలు  చేశారు. 1944లో మరిపెడ మండలం బయ్యారంలో అంధ్ర మహా సభలు పెట్టారు. ఈ సభలలో కృష్ణామాచారి పాల్గొని జనాన్ని ఉత్తేజ పరిచారు. దీంతో దాశరథి ప్రసంగాలపై ఆగ్రహానికి గురైన ఊరి దొరలు పోలీసులతో దాడి చేయించారు. దాశరథిని నెల్లికుదురు ఠాణాకు తీసుకుపోయి చిత్రహింసలు పెట్టారు. ఓ వంట మనిషి సాయంతో అక్కడ్నుంచి దాశరథి తప్పించుకున్నారు.

ఆ తరువాత రెండేళ్ల పాటు అజ్ఞాతంలోనే ఉన్నారు దాశరథి. నిజాం పాలనకు వ్యతిరేకంగా 1947లో వరంగల్ కేంద్రంగా జరిగిన బహిరంగ సభలో మొదటిసారి జనంలోకి వచ్చారు కృష్ణమాచారి. తన పదునైన మాటలు, పాటలతో జనాన్ని ఆకట్టుకున్నారు. ఇక అక్కడే మాటువేసిన పోలీసులు మరోసారి దాశరథిని పట్టుకుని నిజామాబాద్ జైలుకు తరలించారు. ఇట్లాంటి అరెస్టులు, బెదిరింపులకు ఎన్నడూ భయపడలేదు. జైల్లోనే అభ్యుదయ కవితా రచనలు చేశారు. జైలు గోడలనే రాత పుస్తకాలుగా చేసి తన కవితలతో జనాన్ని చైతన్యవంతం చేశారు.

అగ్నిధార, రుద్రవీణ, తిమిరంతో సమరం వంటి ఎన్నో గొప్ప కావ్యాలు రాశారు. ఆయన రాసిన ఆ చల్లని సముద్ర గర్భం… పాట చాలా ఫేమస్. 1948 సెప్టెంబర్ 17న తెలంగాణకు నిజాం పాలన నుంచి విముక్తి లభించిన తరువాత దాశరథి జైలు నుంచి విడుదలయ్యారు. మహాకవి, సింహకవి, అభ్యుదయ కవి,యువ చక్రవర్తి వంటి అనేక బిరుదులు దాశరథి సొంతం. 1972 లో అప్పటి ప్రధాని ఇందిరాగాందీ దాశరథిని జాతీయోద్యమ రథసారధిగా గుర్తించి తామ్రపత్రంతో సన్మానించారు. ఆయన చేసిన కృషికి ఆంధ్ర విశ్వవిద్యాలయం కళా ప్రపూర్ణ బిరుదును ఇవ్వగా…. 1976లో ఆగ్రా యూనివర్సిటీ డాక్టర్ ఆఫ్ లేబర్ పట్టాతో సత్కరించింది. ఇక 1987 లో అమెరికా గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంస్థ దాశరథిని అంధ్ర కవితా సారధి బిరుదుతో ఘనంగా సన్మానించింది. ఇది జరిగిన కొద్ది రోజులకే… 1987 నవంబర్ 5 న కన్నుమూశారు దాశరథి.

తెలంగాణ ప్రభుత్వం దాశరధి కృష్ణమాచార్య జయంత్యుత్సవాలను అధికారికంగా నిర్వహిస్తోంది. ఆయన పేరుతో సాహితీ వేత్తలకు అవార్డులు కూడా ఇస్తోంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy