జపాన్ లో జక్కన్నకు ఘన స్వాగతం

BAHUఅంతర్జాతీయంగా తెలుగు సినిమా స్ధాయిని పెంచిన సినిమా బాహుబలి. అనేక దేశాల్లో విడుదలైన బాహుబలి అక్కడ కూడా రికార్డుల సునామీ సృష్టించింది. ఇటీవలే జపాన్ లో విడుదలైన బాహుబలి ది కన్ క్లూజన్ మంచి కలెక్షన్లతో 100 రోజులు పూర్తి చేసుకొంది. ఈ సందర్భంగా బాహుబలి డైరక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి జపాన్‌ వెళ్లారు. అక్కడి అభిమానుల్ని కలిసి వారితో సందడి చేశారు. ఈ సందర్భంగా రాజమౌళి ట్వీట్‌ చేస్తూ… జపాన్‌లో ఈ సినిమాను పంపిణీ చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు. టోక్యోలో బాహుబలి-2 ప్రదర్శన అద్భుతంగా సాగడానికి కారణమైన అభిమానుల్ని, సినీ జౌత్సాహికులను కలవడం చాలా సంతోషంగా ఉంది. సినిమాలపై ప్రేమకు హద్దులు లేవు అంటూ హ్యాపీ డే  అని జక్కన్న ట్వీట్‌ చేశారు. బాహుబలి స్క్రీనింగ్‌ లో సినీ అభిమానులతో కలిసి దిగిన ఓ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్‌ చేశారు. రాజమౌళితోపాటు నిర్మాత శోభూ యార్లగడ్డ కూడా జపాన్‌ వెళ్లారు. వీరికి స్వాగతం చెబుతూ జపనీయులు ప్లకార్డులు పట్టుకున్నారు. బాహుబలి’ సినిమాను తమకు అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

So happy to meet all the fans and film enthusiasts who made it to the #Baahubali2 screaming screening in Tokyo, Japan last night.
The love for movies surpasses boundaries… Happy day.. 🙂 pic.twitter.com/iau7UAPNZG
— rajamouli ss (@ssrajamouli) April 27, 2018

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy