జపాన్ లో బద్దలైన అగ్నిపర్వతం… పెద్ద ఎత్తున పొగలు,సెగలు

japan250 ఏళ్ల తర్వాత దక్షిణ జపాన్ లోని క్యూషూలోని ఓ అగ్నిపర్వతం బద్దలైంది. దీంతో 100 కిలోమీటర్ల వరకూ పెద్ద ఎత్తున పొగలు, సెగల ప్రభావం కన్పిస్తుంది. 2 కిలోమీటర్ల వరకూ అగ్నిపర్వత శిలలు ఎగిరిపడే అవకాశముందని, దాని దరిదాపుల్లోకి ఎవ్వరూ వెళ్లవద్దని జపాన్ మెట్రోలాజికల్ ఏజెన్సీ హెచ్చరికలు జారీచేసింది. ఇప్పటివరకూ ఎటువంటి ప్రమాదం, నష్టం వాటిల్లినట్లు సమాచారం లేదని అధికారులు తెలిపారు. చివరిసారిగా 1768లో ఈ అగ్నిపర్వతం విస్ఫోటం చెందింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy