జమిలి ఎన్నికలకు TRS రెడీ : ఎంపీ వినోద్

vinodజమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై లా కమిషన్ రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తోందన్నారు ఎంపీ వినోద్. TRS పార్టీ తరఫున లా కమిషన్‌ ను కలిసి సందర్భంగా మాట్లాడిన వినోద్.. జ‌మిలి ఎన్నిక‌ల‌పై సీఎం కేసీఆర్ ఇచ్చిన లేఖ‌ను లా క‌మిష‌న్‌కు అందించినట్లు చెప్పారు. 2019 నుంచి జమిలి ఎన్నికలకు TRS అనుకూలమన్నారు. జమిలి ఎన్నికలంటే అన్ని రాష్ర్టాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడమని.. జమిలి ఎన్నికలపై చర్చ ఇప్పటికిప్పుడే మొదలైంది కాదన్నారు. జమిలి ఎన్నికలపై 1983 నుంచి జాతీయ న్యాయ కమిషన్ చర్చిస్తోందని.. మోడీ ప్రభుత్వమో, బీజేపీ ఈ చర్చను ప్రారంభించలేదని చెప్పారు. జమిలి ఎన్నికలంటే ప్రధాని నరేంద్రమోడీ తెచ్చిన కొత్త విధానం అనుకుంటున్నారని.. మోడీ కంటే ముందు నుంచే ఈ అంశంపై చర్చ జరుగుతోందన్నారు.

ఈ విధానంతో ఐదేళ్లపాటు కేంద్ర, రాష్ర్టాల పాలన సుగమంగా సాగుతుందని చెప్పిన ఆయన.. పూర్తికాలం పాటు ప్రభుత్వాలు స్వేచ్ఛగా పనిచేసే అవకాశం ఉంటుందన్నారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడగానే రాష్ర్టాల్లో జరిగే ఎన్నికలపైనే దృష్టి ఉంటుందని.. మోడీ అధికారంలోకి వచ్చాకా.. ప్రతి ఏడాది ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు వస్తూనే ఉన్నాయని తెలిపారు. దీంతో చాలా డబ్బు, సమయం వృథా అవుతుందన్నారు. 2019లోనే తెలుగు రాష్ర్టాల్లో ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి.. ఒకేసారి ఎన్నికలతో నష్టం ఉండదన్నారు. ముందస్తు ఎన్నికలపై చర్చ అని కొందరు అర్థంలేని వాదనకు తెరలేపారని.. ఒకేసారి దేశవ్యాప్తంగా పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలపైనే చర్చ జరుగుతుందని చెప్పారు. జమిలి ఎన్నికల నిర్వహణ ప్రయోజనాలను కమిషన్‌ కు వివరించామని ఈ సందర్భంగా తెలిపారు ఎంపీ వినోద్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy