జమ్మి చెట్టును పూజిస్తే విజయాలు తథ్యం

jammi-chettuదసరా పండుగనాడు జమ్మిచెట్టును పూజించటం.. జమ్మి ఆకులను బంధుమిత్రులకు ఇచ్చి పుచ్చుకోవడం ఆనావాయితీ. అసలు జమ్మిచెట్టుకి .. దసరా పండగకు ఉన్న సంబంధం ఎంటి ? విజయదశమి నాడు జమ్మిచెట్టుని పూజించి పాల పిట్టను చూస్తే కలిగే లాభమేంటి.. సంప్రదాయాలు ఏం చెబుతున్నాయి.

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగే దసరా. ఈ విజయాల కథల్లోనూ దేశ వ్యాప్తంగా రకరకాల చరిత్రలు, పురాణ గాథలు ఉన్నాయి. దేశమంతా మైసూరు, కలకత్తా, ఒడిషా తెలుగు రాష్ట్రాలు ఇలా ఒక్కో చోట ఒక్కో రకంగా పండుగను జరుపుకుంటారు.

రాముడు రావణ సంహారం చేసి సీతమ్మను తిరిగి అయోద్యకు తీసుకువచ్చిన సందర్భానికి గుర్తుగా ఉత్తరాది ప్రజలు రావణ దహనం చేసి పండుగను జరుపుకుంటారు. పాండవులు అరణ్యవాసం ముగించి, అజ్ఞాతవాసానికి వెళ్తూ జమ్మిచెట్టు కొమ్మల మధ్య తమ ఆయుధాలను దాచివెళ్లారని పురాణాలు చెబుతున్నాయి. వనవాసం తిరిగి వచ్చిన తర్వాత అర్జునుడు జమ్మిచెట్టుపై దాచిన ఆయుధాలను తీసి, పూజించి, ఉత్తర గోగ్రహణ యుద్ధం చేశాడని….. ఆ యుద్దంలో శత్రువులను జయించి విజయం పొందుతాడని చెబుతారు. ఆయుధాలకు రక్షణ కల్పించిన జమ్మిచెట్టును అప్పటి నుంచి పవిత్రంగా భావిస్తారు

జమ్మి చెట్టుకు సంస్కృత భాషలో శమ్మి వృక్షం అంటారు. శమి వృక్షాన్ని బంధువులు , కుటుంబసభ్యులు మార్చుకుని…ఆశీర్వాదాలు తీసుకుంటే అందరికీ మంచిదనీ నమ్మకం. తెలంగాణ ఆచారం ప్రకారం జమ్మి చెట్టుకు పూజ చేసుకుని.. ఆ ఆకులు చేతిలో పట్టుకుని పాలపిట్టను చూస్తే జీవితంలో దౌర్భాగ్యం అనే మాట ఉండదని పండితులు చెబుతున్నారు

హైదరాబాద్ మహానగరంలో సికింద్రాబాద్ లోని RP రోడ్ నవగ్రహ హనుమాన్ టెంపుల్ లో జమ్మిచెట్టు ఉంది. 125 ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ఉన్న జమ్మిచెట్టుని భక్తులు దసరా రోజు లక్షమందికి పైగా భక్తులు వచ్చి పూజలు చేసుకుంటారని ఆలయ నిర్వహకులు చెప్తున్నారు. శ్రవణ నక్షత్రంతో కూడిన దశమి రోజుకు ఎంతో ప్రత్యేక ఉంది. అందుకే దసరా రోజు మన పెద్దవాళ్ళ ఆశీస్సులు తీసుకుంటే అన్ని విధాల విజయం సాధిస్తారని పురాణాలు చెబుతున్నాయి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy