జమ్ములో కాల్పులు..ఉగ్రవాది హతం

indian-armyజమ్ముకశ్మీర్ లో ఎదురు కాల్పులు జరిగాయి. కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఇందులో జవాన్ కూడా అమరుడయ్యాడు. నైబగ్‌కుంద్‌ గ్రామంలో దుండగులున్నారని సమాచారం రావడంతో భద్రతా సిబ్బంది మంగళవారం(నవంబర్-14) ఉదయం గాలింపు చేపట్టారు. ఓ ఇంట్లో నక్కిన ఉగ్రవాదులు భద్రతా సిబ్బందిపై  కాల్పులకు దిగారు. రెండు వర్గాల మధ్య భీకర పోరు జరిగింది. ఈ ఘటనలో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ముష్కరుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఓ జవాను చనిపోయాడు. నౌబగ్‌కుంద్‌లో ఇంకా ఆపరేషన్‌ కొనసాగుతున్నట్లు సమాచారం.మరోవైపు పులభూమా జిల్లా త్రాల్‌ ప్రాంతంలోని లాం గ్రామంలో గాలింపు చేపడుతున్న భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy