జమ్ము-కాశ్మీర్ ఎవరి సొత్తూ కాదు-ఆరెసెస్

JK-map-jk_0.ఆర్టికల్ 370 వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 పై వివాదం రద్దుకు కేంద్రంలోని కొత్త ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిపై జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో రియాక్టయింది. ఆర్టికల్ రద్దుకు కేంద్రం ఎవరెవరితో చర్చలు జరుపుతోందో చెప్పాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. కాశ్మీర్ ను భారత్ లో భాగం చేసి రాజ్యాంగ పరిషత్ ను పునరుద్దరించే వరకు 370 రద్దు చేయడానికి వీలు లేదని…. ఆ పరిషత్ లో చర్చించాకే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేషనల్ కాన్ఫరెన్స్ లో కోర్ గ్రూప్ మీట్ లోనూ ఒమర్ కేంద్రం తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.370 రద్దుకు భాగస్వామ్య పక్షాలతో చర్చలు ప్రారంభమయ్యాయని కేంద్రం చెబుతున్న మాటలపై జమ్మూ సర్కార్ విమర్శలు గుప్పిస్తోంది. అసలు దీనిపై ఎవరితో చర్చలు జరుపుతున్నారని సీఎం ఒమర్ ప్రశ్నిస్తున్నారు. సీఎంగా తమకూ బాధ్యత ఉందన్నారు. అసలు ఎవరితో మాట్లాడకుండా కేంద్రం ముందుకు వెళ్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. 370 రద్దయితే కాశ్మీర్ భారత్ లో అంతర్భాగంగా ఉండదంటూ ఒమర్ ఘాటు వ్యాఖ్యలే చేశారు.
అటు ఒమర్ కామెంట్స్ కు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది…. RSS . జమ్మూ ఎవరి సొత్తూ కాదని 370 ఉన్నా లేకున్నా ఆ రాష్ట్రం భారత్ లో అంతర్భాగమేనని సంఘ్ నేతలు చెబుతున్నారు. ఇక పీడీపీ నేత మెహబూబ్ ముప్తీ కూడా 370 ని తొలగించమని కేంద్రం హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ పరిషత్ అనుమతి లేకుండా 370 ఆర్టికల్ ను రద్దు చేయొద్దని ఈ విషయం రాజ్యాంగంలో స్పష్టంగా ఉందని చెప్పారు…ముప్తీ. అటు రాజకీయ లబ్ది కోసమే బీజేపీ ఇదంతా చేస్తుందని కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది.
కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి రాజ్యాంగం ఇచ్చిన హామీ. 1947 లో స్వతంత్ర సంస్థానంగా ఉన్న జమ్మూకాశ్మీర్ ను భారత్ లో విలీనం చేసినప్పుడు కేంద్రం ఆర్టికల్ 370 ని రూపొందించింది. దీని ప్రకారం జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేక స్వయం ప్రతిపత్తి కల్పించే తాత్కాలిక నిబంధన. రాజ్యాంగంలో ఇతర రాష్ట్రాలన్నిటికీ వర్తించే అధికరణలన్నీ జమ్మూకు వర్తించవు. రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, సమాచార అంశాలు మినహా భారత పార్లమెంట్ చేసే ఏ చట్టాలైనా ఈ రాష్ట్రానికి వర్తింపచేయాలంటే అందుకు పార్లమెంట్ ఆ రాష్ట్ర ప్రభుత్వ ఆమోదాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. అందుకే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే జమ్మూలోని పౌరులకు, పౌరసత్వం, ఆస్తిపై యాజమాన్యం ప్రాథమిక హక్కులు వంటి వాటితో సహా ప్రత్యేక చట్టాలు ఉంటాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు జమ్మూలో ఆస్తులు కొనడానికి కూడా వీల్లేదు.

ఆర్టికల్ 370ని రద్దు కోసం బీజేపీ ఎప్పటినుంచో ప్రయత్నం చేస్తోంది. అధికారంలోకి వచ్చీ రాగానే దీనిపై కాన్సంట్రేట్ చేసింది. అటు జమ్మూలోని పార్టీలు దీనికి ఒప్పుకునే పరిస్థితి లేదు. మొత్తంమీద 370 రగడ ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy