జమ్మూకశ్మీర్‌లోఎన్ కౌంటర్: 8మంది ఉగ్రవాదులు హతం

ENCOUNTERజమ్మూకశ్మీర్‌లోజరుగుతున్నవరుస ఎన్‌కౌంటర్లతో ఉగ్రవాదులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్తాన్ బోర్డర్ లో ఆదివారం(ఏప్రిల్-1) తెల్లవారుజామున చోటు చేసుకున్న ఎన్‌కౌంటర్లలో ఎనిమిది మంది ఉగ్రవాదులు హతమయ్యారు. సోఫియాన్‌ జిల్లాలో రెండు చోట్ల, అనంతనాగ్‌ జిల్లాలో ఒకచోట ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. సోఫియాన్‌ జిల్లా కచ్చాదోరా ఏరియా, ద్రాగాడ్‌ గ్రామాల్లోకి సాయుధులు చొరబడ్డారన్న సమాచారంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి.

ఈ క్రమంలో ఎదురుకాల్పులు జరగగా ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల కాల్పుల్లో నలుగురు జవాన్లకు గాయాలయ్యాయి. అటు అనంతనాగ్‌ జిల్లాలోని దైల్‌గావ్‌ ప్రాంతంలో.. ఉగ్రవాదులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక మిలిటెంట్‌ హతమయ్యాడు. మరో ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాదుల కోసం భద్రతాదళాలు వేట కొనసాగిస్తున్నాయి.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy