జమ్మూకాశ్మీర్ సీఎం ముఫ్తీ మహ్మద్ సయీద్ కన్నుమూత

mufti-sayeed-v6జమ్మూ కాశ్మీర్ సీఎం, పీడీపీ అధినేత ముఫ్తీ మహ్మద్ సయీద్ కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఢిల్లీలోని ఎయిమ్స్ లో తుదిశ్వాస విడిచారు. తీవ్ర జ్వరం, మెడనొప్పితో గత డిసెంబర్ 24న ఎయిమ్స్ లో చేరారు ముఫ్తీ. అప్పటి నుంచి ఆయన పరిస్థితి విషమంగానే ఉంది. వారం రోజుల నుంచి వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న ఆయన గురువారం ఉదయం 7.30 గంటలకు చనిపోయారు.

ముఫ్తీ మహమ్మద్ సయీద్ గతేడాది మార్చి 1న జమ్మూకాశ్మీర్ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమిని కాదని పీడీపీ, బీజేపీ కూటమిని గెలిపించారు జమ్మూకాశ్మీర్ ప్రజలు. ముఫ్తీ రాజకీయ జీవితంలో ఎన్నో మలుపులున్నాయి. 1989లో కేంద్ర హోమ్ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. వీపీ సింగ్ జన్ మోర్చా ప్రభుత్వంలో పనిచేశారు. కేంద్ర హోమ్ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తొలి ముస్లీం ముఫ్తీ మహమ్మదే.

ముఫ్తీ జీవితం – రాజకీయ ప్రస్థానం

జమ్మూ కాశ్మీర్ లోని బిజ్ బెహరాలో జనవరి 12, 1936లో జన్మించారు ముఫ్తీ. ఆయనకు ముగ్గురు సంతానం. వీరిలో కూతురు మెహబూబా ముఫ్తీ తన రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు.  కాంగ్రెస్ నేతగా 1987 వరకు చురుగ్గా పనిచేసిన ఆయన.. తర్వాత వీపీ సింగ్ ప్రభుత్వంలో చేరారు. ఆ తర్వాత 1999లో కూతురు మెహబూబా ముఫ్తీతో కలిసి సొంతంగా జమ్మూకాశ్మీర్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత 2002 నుంచి 2005 వరకు కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ అయ్యారు. మళ్లీ పీడీపీ- బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో 2015 మార్చి  నుంచి 2016 జనవరి వరకు సీఎంగా ఉన్నారు. ముఫ్తీ తర్వాత ఆయన కూతురు మెహబూబా ముఫ్తీ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నాయి రాజకీయ వర్గాలు.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy