జమ్మూలో పోలీస్‌ భవనంపై ఉగ్రదాడి.. ఒకరి మృతి

61503714071_625x300

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో శనివారం(ఆగస్టు-26) తెల్లవారుజామున ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పుల్వామాలో పోలీసు లైన్ల వద్ద కాపలాగా ఉన్న భద్రతా సిబ్బందిపై మెరుపు దాడికి దిగారు. ఈ ఘటనలో ఓ పోలీసు మృతిచెందగా.. మరో ఆరుగురు గాయపడ్డారు. పుల్వామాలోని జిల్లా పోలీసు భవనంపై ఈ ఉదయం ఉగ్రవాదులు దాడి చేశారు. ముగ్గురు ఉగ్రవాదులు భవనంలోకి చొరబడి కాల్పులు జరిపారు. పోలీసులపైకి గ్రనేడ్లు విసిరారు. కాల్పులతో బెదిరిస్తూ.. భవనం లోపలికి వెళ్లి ఉగ్రవాదులు దాక్కున్నట్లు సమాచారం.

ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ పోలీసు మృతిచెందగా.. మరో ఆరుగురు గాయపడ్డారు. వీరిలో ముగ్గురు సీఆర్పీఎఫ్‌ జవాన్లు కూడా ఉన్నారు. అయితే ఉగ్రవాదులు పోలీసులను బంధీలుగా చేసుకోలేదని ఐజీ మునీర్‌ అహ్మద్‌ఖాన్‌ తెలిపారు. సీఆర్పీఎఫ్‌, పోలీసులు భవనాన్ని చుట్టుముట్టారు. ప్రస్తుతం ఆపరేషన్‌ కొనసాగుతోందని మునీర్‌ వెల్లడించారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy