జయలలిత నా కన్నతల్లి : అమృత

jaya.shobanజయలలిత నా కన్నతల్లి అని సంచలన ప్రకటన చేసింది అమృత. బెంగళూరుకు చెందిన ఆ మహిళ తాను జయలలిత కూతురినని నిరూపించుకునేందుకు డీఎన్‌ఏ పరీక్షలకు సైతం సిద్ధమంటుంది. మరోవైపు, జయలలితది సహజ మరణం కాదని, నిజాలను రాబట్టేందుకు సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ ప్రధాని మోడీ, రాష్ట్రపతి కోవింద్‌ తదితరులకు ఆమె రాసిన లేఖలు మంగళవారం వెలుగులోకి వచ్చాయి.

ఆ లేఖలో ఉన్న సారాంశం ఇదే..

జయలలిత తన అమ్మానాన్నలను కోల్పోయి మానసికంగా కుంగిపోయిన దశలో అలనాటి తెలుగు సినీ హీరో శోభన్‌బాబు సహకారంతో కోలుకుంది. ఆ సమయంలో వారిద్దరి ప్రేమకు గుర్తుగా నేను(అమృత) పుట్టాను. సామాజిక కట్టుబాట్ల కారణంగా వారి వివాహం జరగలేదు. బెంగళూరులో ఉంటున్న జయలలిత సోదరి శైలజ, భర్త సారథిలకు నన్ను అప్పగించారు. తన కుమార్తెననే విషయం చెప్పొద్దని వారితో ఒట్టు వేయించుకుంది నా తల్లి జయలలిత.

1996లో జయను కలవమని నన్ను పెంచిన తల్లి శైలజ సూచించారని, ఆమెను కలిసినపుడు తనను చూడగానే జయ తన వివరాలు కనుక్కొని ఆప్యాయతతో ఆలింగనం చేసుకున్నారని చెపుతుంది అమృత. ఆ తర్వాతా అనేకసార్లు కలిశా. తానే నీ తల్లినని ఆమె తనతో ఎన్నడూ అనలేదు. జయ మరణం తర్వాత దీప, దీపక్‌లు ఆమె ఆస్తులకు వారసులమని చెబుతున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలను చూసి, అమెరికాలో ఉన్న తమ బంధువైన జయలక్ష్మి తనకు ఫోన్‌ చేసి జయ సంతానం తానే అని చెప్పారు అని వివరించింది అమృత. ‘’బెంగళూరులో ఉంటున్న మరో బంధువు సైతం ఇదే మాట చెప్పారు. నా తల్లిని కొంతమంది కుట్రచేసి చంపారు. వారిలో అన్నాడీఎంకే నాయకురాలు శశికళ, నటరాజన్‌లు ముఖ్యులు’ అని  అమృత  ప్రధాని, రాష్ట్రపతికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy