జయలలిత పాత్ర చేస్తా.. అయితే

ramayakrishnaఆమె టాలెంట్ ను ఇప్పటి వరకు ఎవరూ ప్రశ్నించింది లేదు.. నటనను విమర్శకులు సైతం ప్రశంసించారు.. క్యారెక్టర్ కు ఎంపిక చేస్తే కనిపించేది తను కాదు.. నా నటన అంటారు రమ్యకృష్ణ. బాహుబలిలో శివగామి పాత్రతో జాతీయ గుర్తింపు తెచ్చుకున్నారు. వాట్ నెక్ట్స్ అని అందరూ ప్రశ్నిస్తున్నారు నటిని. దీనికి సమాధానం చెప్పింది రమ్య. ఓ జాతీయ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడింది. తమిళనాడు పురచ్చితలై.. అమ్మ.. జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో నటించే అవకాశం వస్తే నటించటానికి ఓకే చెప్పింది. అయితే ఇంకా ఇది చర్చల దశలోనే ఉందని.. గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని చెప్పుకొచ్చింది. జయలలిత పాత్రలో మీరు సరిగ్గా సరిపోతారు.. నరసింహా, బాహుబలిలో మీ నటన చూసిన తర్వాత జయలలితలో మిమ్మల్నే ఊహించుకుంటున్నారు అభిమానులు అని.. మరో ప్రశ్న కూడా సందించారు. దీనిపై తెలివిగా తప్పించుకుంది రమ్యకృష్ణ. నటన నా వృత్తి.. ఇష్టంగా చేస్తా.. జయలలిత పాత్రకు నేనే సరిపోతాను అనుకుంటే.. తప్పకుండా చేస్తా అని చెప్పారు. ఐదు నెలలుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలకు ఈ విధంగా సమాధానం చెప్పింది శివగామి. బాహుబలి పార్ట్ వన్ తర్వాత… ట్విట్టర్ లో వచ్చిందని అభిమానిగా ఆమెను ఆరాధిస్తానని చెప్పుకొచ్చారు. నాయకురాలిగా, గొప్ప వ్యక్తిగా ఆమె పాత్రను చేయడానికి ఇష్టపడతానని చెప్పారు. దీనిపై ఇప్పుడు చర్చలు జరగటం లేదని వివరణ ఇచ్చింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy