జయహో రైడ్ : టూ వీలర్స్ లో వాల్డ్ నంబర్ 1

bikesఇండియా పేద దేశం అని ఎవరన్నారు.. ఖర్చు పెట్టలేరని ఎవరన్నారు.. జనాభాలో భారత్ ను బీట్ చేసిన డ్రాగన్.. ఒక్క విషయంలో మాత్రం చైనాతో సహా ప్రపంచదేశాలన్నింటినీ తలతన్నేసింది. అదేనండీ బైక్స్ (టూ వీలర్స్) కొనుగోళ్లతో వాల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది భారతదేశం. గత ఏడాది ఆర్థిక సంవత్సరం (2016-17) లెక్కలు చూస్తే ఇదే విషయం స్పష్టం అవుతుంది. ఇప్పటి వరకు టూవీలర్స్ అమ్మకాల్లో దూసుకెళుతున్న చైనా రికార్డ్ ను బద్దలుకొట్టింది ఇండియా. గత ఆర్థిక సంవత్సరంలో చైనా దేశం 16.8 మిలియన్స్ బైక్స్ అమ్మకాలు చేస్తే.. ఇండియాలో ఆ సంఖ్య 17.7 మిలియన్ గా ఉంది. ఇదే ఒరవడి ఇండియాలో కొనసాగవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రతి ఒక్కరికీ టూవీలర్ కామన్ అయిపోయింది. చేతిలో రూపాయి లేకుండానే EMI ఆప్షన్ తో కంపెనీలు ఆఫర్స్ ప్రకటిస్తున్నారు. ఈ కారణంతోనే సేల్స్ అమాంతం పెరిగాయంటున్నారు.

2010 ఒక్క సంవత్సరంలోనే చైనాలో 27 మినియన్ టూవీలర్స్ అమ్మకాలు సాగాయి. 2015 వరకు ఇదే ఒరవడి కొనసాగింది. డ్రాగన్ దేశంలో తలెత్తిన పొల్యూషన్, ట్రాఫిక్ సమస్యల క్రమంలో కొన్ని నగరాల్లో టూవీలర్స్ అమ్మకాలపై నిషేధం విధించింది అక్కడి ప్రభుత్వం. సుమారు 200 మునిసిపాలిటీల్లో కొత్త బైక్స్ అమ్మకాలపై ఆంక్షలు పెట్టింది. దీంతో సేల్స్ 10 మినియన్స్ పడిపోయాయి. ఇదే క్రమంలో ఇండియాలో బైక్స్ సేల్స్ బాగా పెరిగాయి. 2011-12లో 13 మినియన్స్ ఉన్న ఈ సంఖ్య.. గత ఏడాది 17 మినియన్స్ కు చేరింది. ఇది క్రమంగా పెరిగి రాబోయే రెండేళ్లలో 20 మినియన్స్ కు చేరొచ్చని ఆటోమొబైల్ ఇండస్ట్రీ నిపుణుల అంచనా.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy