
జయలలిత ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాక 24 బెడ్ ల ICU ను పూర్తిగా ఆమె కోసమే కేటాయించామన్నారు. 75 రోజుల ట్రీట్ మెంట్ తర్వాత 2016 డిసెంబర్లో ఆమె చనిపోయిందని ఆయన తెలిపారు. ఆమె అడ్మిట్ అయిన వెంటనే ICUలోని పేషంట్లు అందరినీ వేరే ICUకి మార్చామన్నారు. అయితే జయ మృతి వెనుక కారణాలపై రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఎంక్వైరీ కమిషన్ దర్యాప్తు జరుపుతుంది.
కొన్నిరోజుల క్రితం ఈ కమీషన్ ఎదుట విచారణకు హాజరైన జయ స్నేహితురాలు, ఆస్పత్రిలో జయ ఉన్న సమయంలో అన్నీ తానై చూసుకొన్న శశికళ జయ ట్రీట్ మెంట్ సమయంలో నాలుగుసార్లు ఆమె వీడియో రికార్డ్ జరిగిందని తెలిపింది. అయితే ఇప్పుడు ప్రతాప్ రెడ్డి చెప్పినట్లుగా ఆమె ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ పొందిన వీడియో రికార్డు కాలేదని తేలిపోయింది. దీంతో నిజానికి ఆస్పత్రిలో ఏం జరిగిందనే దానిపై మరిన్ని అనుమానాలు తలెత్తే అవకాశముందని పలువురు అభిప్రాయపడుతున్నారు.