జయ పచ్చ పచ్చగా!

ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశాక, గ్రీన్ కలర్ పెన్ తో జయ సంతకం. వేలికి పచ్చ ఉంగరం, పచ్చరంగు చీర కూడా గమనించండి

ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశాక, గ్రీన్ కలర్ పెన్ తో జయ సంతకం. వేలికి పచ్చ ఉంగరం, పచ్చరంగు చీర కూడా గమనించండి

జాతకాలు, జ్యోతిష్యాలు, సెంటిమెంట్లు.. తమిళనాడు అమ్మ జయలలితకు ఇవంటే చాలా నమ్మకం. అదే విషయాన్ని ఇప్పుడు మరోసారి ప్రూవ్ చేశారామె. తమిళనాడు సీఎంగా ఐదోసారి ప్రమాణస్వీకారం చేసిన సెల్వి.. సెంటిమెంట్ కే ప్రయారిటీ ఇచ్చారు. ముహూర్తం నుంచి… చీర కలర్ వరకు … ప్రతి ఒక్కటీ జ్యోతిష్యులు చెప్పిన ప్రకారమే నడుచుకున్నారు. స్థిరత్వానికి ప్రతీకగా శనివారం ప్రమాణం చేశారు జయలలిత. ఆకుపచ్చ సెంటిమెంట్ ను కంటిన్యూ చేశారు. అనుకున్న ముహూర్తానికి ప్రమాణం చేయడంతో పాటు ఆకుపచ్చ చీర, ఆకుపచ్చ రాయి పొదిగిన ఉంగరం, సంతకం చేయడానికి ఆకుపచ్చ పెన్ను ఉపయోగించారు. ఇక వేదిక కూడా ఆకుపచ్చ రంగుతోనే డెకరేట్ చేశారు.

మద్రాస్ వర్సిటీ సెంటెనరీ హాల్ లో జయ ప్రమాణ స్వీకార కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. జయతో ఆ రాష్ట్ర గవర్నర్ రోశయ్య ప్రమాణం చేయించారు. పాత క్యాబినెట్ ను యాజ్ ఇట్ ఈజ్ గా కంటిన్యూ చేశారు జయ. 28 మంది మంత్రులుగా ఒకేసారి ప్రమాణం చేశారు. ఆర్ధిక మంత్రిగా పన్నీర్ సెల్వం, విద్యుత్ మంత్రిగా నాథమ్ ఆర్ విశ్వనాథన్, గృహ నిర్మాణశాఖ మంత్రిగా ఆర్. వైదిలింగంకు అవకాశం కల్పించారు.

అమ్మ పట్టాభిషేకానికి సీని, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. సూపర్ స్టార్ రజనీ కాంత్, శరత్ కుమార్, ప్రభు, ఇళయరాజా, బీసీసీఐ మాజీ చీఫ్ శ్రీనివాసన్ తోపాటు… ఇతర ప్రముఖులంతా కార్యక్రమానికి తరలివచ్చారు.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలటంతో.. సీఎం పదవికి రిజైన్ చేసిన జయ.. గతేడాది సెప్టెంబర్ 29న పన్నీర్ సెల్వంను గద్దెనెక్కించారు. ఈనెల 11న కర్ణాటక కోర్టు నిర్దోషిగా తేల్చటంతో.. ఐదోసారి సీఎం పీఠంపై ఆశీనులయ్యారు పురుచ్చితలైవి. దీంతో తమిళనాడులో డీఎంకే అధినేత కరుణానిధి రికార్డును సమం చేశారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy