జరజాగ్రత్త : ఇవాళ, రేపు వడగాల్పులు

sunరాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మరో రెండు రోజులు (ఇవాళ, రేపు) వడగాల్పులు ఉంటాయని తెలిపారు వాతావరణశాఖ అధికారులు. సోమవారం (మే 15) ఆదిలాబాద్, నల్లగొండల్లో 45 డిగ్రీల సెల్సియస్‌ చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అనేక ప్రాంతా ల్లోనూ 44 డిగ్రీలు రికార్డు అయ్యాయి. మరోవైపు అక్కడక్కడ వర్షాలు కురిశాయి. గత 24 గంటల్లో నాగర్‌ కర్నూలులో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొల్లాపూర్, నవాబ్‌పేట్, మగ్నూరు, దోమకొండ, రామాయంపేటల్లో ఒక సెంటీమీటర్‌ చొప్పున వర్షం కురిసింది.

నాలుగైదు రోజుల క్రితం క్యుములోనింబస్‌ మేఘాల కారణంగా కురిసిన వర్షంతో వాతావరణం చల్లబడి ఊష్ణోగ్రతలు పడిపోయాయి. 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత పడిపోవడంతో ప్రజల కొంత ఊరట చెందారు. కానీ.. తిరిగి రెండు రోజుల నుంచి భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. వడగాలులు, ఎండ తీవ్రతతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మే 19వ తేదీ వరకు ఇదే అత్యధికంగా టెంపరేచర్స్ నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు వాతావరణశాఖ అధికారులు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy