జర్నలిస్టులపై కేరళ పోలీస్ ఓవరాక్షన్

police_brutality01కేరళలో ఓ పోలీస్ .. జర్నలిస్టులపై రెచ్చిపోయాడు. రౌడీలను ఈడ్చుకెళ్లినట్టు విలేఖరులను పోలీస్ స్టేషన్ కు ఈడ్చుకుంటూ వెళ్లాడు. ఇదంతా కేరళలోని కోజికోడ్ లో జరిగింది. స్థానిక కోర్టులో వార్తలను కవర్ చేయడానికి వెళ్లారు ఆ నలుగురు ఏషియన్ టీవీ జర్నలిస్టులు. ఇంతలో ఇక్కడ ఎందుకు ఉన్నారు అంటూ.. కొట్టుకుంటూ.. ఈడ్చుకుంటూ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాడు ఎస్సై. దీనిపై జర్నలిస్టు సంఘాలు.. రాజకీయపార్టీలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేయడంతో ఆ పోలీస్ ఆఫీసర్ ను సస్పెండ్ చేసింది ప్రభుత్వం. ఇంతకు అసలు విషయం ఏంటంటే… కోర్టు ప్రాంగణంలో జర్నలిస్టులకు అనుమతి లేదని.. వీరావేశంతో ఆ పోలీస్ అలా ప్రవర్తించాడు. అయితే అలాంటిది ఏమీ లేదని కోర్టు తర్వాత చెప్పడంతో .. అతన్ని సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy