జర్నలిస్టు కుటుంబాలకు చెక్కులందజేసిన కేసీఆర్

Janahitha-kcrప్రజలను నేరుగా కలుసుకునేందుకు జనహిత భవన్ ను ప్రారంభించారు సీఎం కేసీఆర్. తొలి రోజు జనహిత భవన్లో జర్నలిస్టు కుటుంబ సభ్యులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 84 మంది జర్నలిస్టుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున చెక్కులను ముఖ్యమంత్రి కేసీఆర్‌, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అందజేశారు.

చనిపోయిన స్పోర్ట్స్‌ జర్నలిస్టు శ్రీనివాసులు కుటుంబానికి సీఎం రూ.4 లక్షల ఆర్థికసాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లారెడ్డి, ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ, ఇతర సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy