జలం.. ఆస్కార్ మూవీనా

04ఓ భర్త, ఓ భార్య, ఓ చంటి పిల్లోడు.. హ్యాపీగా సాగిపోతున్న సంసారం.. ఓరోజు ఇంటి యజమాని యాక్సిడెంట్ లో చనిపోతాడు..భార్య, కొడుకు అనాథలు అవుతారు.. భారం అంతా భార్యపైనే పడుతుంది. మహానగరంలో బతుకు పోరాటం.. అంతా ఆమెపైనే పడుతుంది. చదువు రాదు.. చదువుకునే సమయమూ లేదు.. పొట్టకూటి కోసం.. కొడుకును ప్రయోజకుడిని చేయాలని తపనతో ఇంటి నుంచి బయటకు అడుగు పెడుతోంది. అక్కడి నుంచి ఆ వితంతు మహిళ ఎదుర్కొన్న సమస్యలకు దృశ్యరూపమే జలం మూవీ. మళయాళంలో పద్మకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. భర్తలేని మహిళను సమాజం ఏ విధంగా చూస్తుంది.. బస్తీలోని మగాళ్లు ఏ విధంగా కామెంట్స్ చేస్తుంటారు ఇలాంటి సన్నివేశాలు కదిలించాయంటున్నారు సినీ వర్గాలు. పని చేసేచోట ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి.. కొడుకు చదువు కోసం తపించే మహిళగా.. వితంతు క్యారెక్టర్ లో హీరోయిన్ ప్రియాంక నాయర్ నటన అద్బుతం అంటోంది కోలీవుడ్. వాల్డ్ ఫస్ట్ చారిటీ మూవీ. ఈ సినిమాపై వచ్చే ప్రతిసైసా.. భర్తలేక బతుకు పోరాటం చేస్తున్న మహిళలకే చెందుతుంది. ప్రపంచంలో చారిటీ కోసం తెరకెక్కుతున్న మొదటి సినిమా కూడా ఇదే కావటం విశేషం.. 2016 మార్చి, ఏప్రిల్ లో రిలీజ్ కాబోయే ఈ సినిమా.. ఆస్కార్ రేసులో ఉండటం ఖాయమని కోలీవుడ్ ఘంటాపథంగా చెబుతోంది. జలం.. ఆల్ ద బెస్ట్..

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy