ఆలింగనం చేసుకున్న చంద్రబాబు, కేసీఆర్ !

CM-IMAGE2సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ జలవిహర్ లో ‘అలాయ్-బలాయ్’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం దసరా తర్వాత ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసే సాంప్రదాయం ఉంది దత్తన్నకు. అన్ని పార్టీల నాయకులను, అధికారులను, ఇతర ప్రముఖులను పిలిచి ‘అలాయ్-బలాయ్’ ఇచ్చారు దత్తన్న. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు, గవర్నర్ అటెండ్ అయ్యారు. చంద్రబాబు, కేసీఆర్ ఆలింగనం చేసుకోవడం ఈ అలాయ్ బలాయ్ స్పెషాలిటీ. కేసీఆర్ మాట్లాడుతూ, దత్తాత్రేయ అలాయ్-బలాయ్ సృష్టికర్త అని చెప్పారు. పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా అలాయ్-బలాయ్ జరగడం సంతోషంగా ఉందని అన్నారు కేసీఆర్. అలాగే, గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ, పదేళ్లుగా దత్తాత్రేయ అలాయ్-బలాయ్ నిర్వహించడం గర్వకారణమని అన్నారు. రెండు రాష్ట్రాలు కలిసి అభివృద్ధి చెందాలని అన్నారు. రాజకీయాల కంటే సామాజిక అభ్యున్నతే ముఖ్యమని చెప్పారు గవర్నర్.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy